ఇచ్చిన హామీలను అడిగితేనే అంక్షలా - సీపీఎస్ ఉద్యోగులకు పోలీసుల నోటీసులు - ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 17, 2024, 11:38 AM IST

Notices to CPS Employees: సీపీఎస్ ఉద్యోగులపై ప్రభుత్వం ముప్పేట దాడి చేస్తోంది. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరిస్తామని ప్రతిపక్షనేతగా జగన్ హామీ ఇచ్చారు. దీన్ని అమలు చేయాలని కోరితే కేసులతో ఉద్యోగులను జగన్ ప్రభుత్వం భయపెడుతోంది. సీపీఎస్ ఉద్యోగులు చిన్న సమావేశం పెట్టుకోవాలన్నా అనుమతి ఇవ్వకపోగా ఉద్యోగులందరికీ నోటీసులు ఇస్తోంది. అంతేకాకుండా ఏకంగా పోలీసు స్టేపన్లలో కూర్చోబెడుతోంది. 

ఈనెల 18న విజయవాడలో ఓపీఎస్ పేరుతో సభ నిర్వహణకు ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. సభ నిర్వహణకు దరఖాస్తు చేసినా అనుమతి ఇవ్వకుండా ఉద్యోగులకు పోలీసులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. పాఠశాలలకు వెళ్లి మరీ ఉపాధ్యాయులకు నోటీసులు ఇచ్చారు. కొందర్ని పోలీసు స్టేషన్లకు పిలిపించి స్టేషన్లలో కూర్చోబెట్టారు. కార్యాలయాలు, బడులకు పోలీసులు సహచర సిబ్బంది రావడంతో  విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. అనుమతులు లేకుండా ఎలాంటి సభలకు హాజరు కావోద్దనే అంక్షాలను గుప్పిస్తున్నారు. దీనిపై సీపీఎస్​ ఎంప్లాయిస్​ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.