LIVE రాజంపేట లోక్‌సభ పరిధిలోని పీలేరు నియోజకవర్గంలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం - ప్రత్యక్ష ప్రసారం - Narendra Modi Public Meeting - NARENDRA MODI PUBLIC MEETING
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 8, 2024, 4:12 PM IST
|Updated : May 8, 2024, 4:52 PM IST
Narendra Modi Public Meeting live In Pileru :ఎన్డీఏది అభివృద్ధి మంత్రం అయితే, వైసీపీది అవినీతి తంత్రం అని ప్రధాని నరంద్ర మోదీ అన్నారు. సోమవారం అనకాపల్లి జిల్లా రాజుపాలెంలో కూటమి బహిరంగ సభలో పాల్గొన్న ఆయన, జగన్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ఏపీలో కేంద్రం చేపట్టిన అభివృద్ధి పనులను వైసీపీ ప్రభుత్వం అడ్డుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ రైల్వే జోన్ కార్యాలయానికి వైసీపీ ప్రభుత్వం భూమి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కేంద్రం ఇళ్లు ఇచ్చినా జగన్ నిర్మించలేదని ధ్వజమెత్తారు. .పోలవరం ప్రాజెక్టును జగన్‌రెడ్డి తండ్రి ప్రారంభించారు, తండ్రి రాజకీయ వారసత్వాన్ని జగన్ అందుకున్నారని విమర్శించారు. పోలవరం నిర్మాణాన్ని మాత్రం జగన్ అడ్డుకుంటున్నారని, పోలవరం కోసం కేంద్రం 15 వేల కోట్లు ఇస్తే, ప్రాజెక్టు నిర్మాణాన్ని జగన్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఏపీలో అనేక చక్కెర పరిశ్రమలు మూతపడ్డాయని, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల చెరకు రైతులు ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో చెరకు రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు.ప్రస్తుతం పీలేరు ప్రజాగళం సభకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం
Last Updated : May 8, 2024, 4:52 PM IST