వివేకా హత్య జరిగిన సమయంలో చంద్రబాబు సీఎంగా ఉన్నారు: ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి - YS Vivekananda Reddy murder - YS VIVEKANANDA REDDY MURDER
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 28, 2024, 4:35 PM IST
MLA Ravindranath Reddy Key comments: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆ సమయంలో ఇంటెలిజెన్స్ అధికారిగా వెంకటేశ్వరరావు ఉన్నారనీ, వివేకా హత్య కేసును చంద్రబాబు తన పార్టీ నాయకులపైకి రాకుండా, అప్పట్లో వైసీపీపై రుద్దే ప్రయత్నం చేశారని, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు.
వివేకా హత్య కేసులో చంద్రబాబు తనకు ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నారని రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం జగన్ బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగిందని, కొన్ని పత్రికలు యాత్ర తుస్సు అంటూ రాశాయని తెలిపారు. సీఎం జగన్ బస్సుయాత్రలో పాల్గొనేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారని తెలిపారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కరువు విలయ తాండవం చేసిందని, వర్షాలు కురవని పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు జనసేన, బీజేపీతో పాటుగా అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీతో సైతం పొత్తు పెట్టుకున్నారని తెలిపారు. ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీ నేతకైనా బీ ఫారాం ఇవ్వాలంటే చంద్రబాబు సూచించాల్సిన పరిస్థితి ఉందన్నారు.