వైఎస్సార్సీపీ నిర్వాకంతో రాష్ట్ర ఖజానా ఖాళీ: మంత్రి నారాయణ - Minister Narayana Started Gym
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 5, 2024, 12:30 PM IST
Minister Narayana Started Gym at Vijayawada : రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందని మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ అన్నారు. కాగితాల మీద మాత్రమే డబ్బులు ఉన్నాయని తెలిపారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విజయవాడ అభివృద్ధికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదని చెప్పారు. విజయవాడలోని మురుగు కాలువల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హమీ ఇచ్చారు. నగరంలోని వెటర్నరీ కాలనీలోని వీఎంసీ (vijayawada municipal corporation) పార్క్‌లో స్థానిక ప్రజలు సొంత నిధులతో నిర్మించుకున్న జిమ్‌ను నారాయణ ప్రారంభించారు.
త్వరలో ఒక్కో సమస్యని పరిష్కారిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం నగర అభివృద్ధికి కేటాయించాల్సిన రూ. 17 వేల కోట్లు విడుదల చేయలేదని ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఖజానా ఖాళీగా ఉందని దీనికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే కారణమని నారాయణ మండిపడ్డారు. నగరంలో మురుగు కాలువల సమస్య, పచ్చదనం, పర్యావరణ అభివృద్ధిపై వీఎంసీ అధికారులతో చర్చించినట్లు తెలిపారు. త్వరలో ఒక్కో సమస్యని పరిష్కారం చేస్తామని విజయవాడ ప్రజలకు హామీ ఇచ్చారు. పార్కులు అభివృద్ధి జరిగితే కాలనీల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు.