నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని సీఎంను కోరా: మంత్రి దుర్గేష్ - Minister Kandula Durgesh Visit - MINISTER KANDULA DURGESH VISIT
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-07-2024/640-480-22023796-thumbnail-16x9-minister-visit-red-canal.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 23, 2024, 12:10 PM IST
Minister Kandula Durgesh Visit Red Canal Flood Effect Area : ఎర్రకాలువ వరద ఉద్ధృతి కారణంగా పొలాలు నష్టపోవడమే కాకుండా గ్రామాల్లోకి నీరు చేరి ఇళ్లు కూడా దెబ్బతినే పరిస్థితులు ఏర్పడ్డాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. నిడదవోలు నియోజకవర్గంలోని తాళ్లపాలెం ముంపునకు గురైన నివాసిత గృహాలకు వెళ్లి బాధితులను మంత్రి పరామర్శించారు. పునరావాస కేంద్రాలకు తరలించిన బాధితులను పరామర్శించి వారికి కల్పిస్తున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఉండ్రాజవరం మండలం కాల్దరి, పసలపూడి, సూర్యారావుపాలెంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. రైతులను అడిగి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు దుర్గేష్ చెప్పారు. సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. గత ప్రభుత్వం గడిచిన అయిదేళ్లలో ఎర్రకాలువ వరద నియంత్రణ పటిష్టతను ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఎర్రకాలువ ఆధునికీకరణపై సీఎం, ఉప ముఖ్యమంత్రులతో చర్చించాలని పేర్కొన్నారు.