అపోహలు నమ్మొద్దు - చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటా: కళా వెంకట్రావు - Kala Comments on Assembly Seat
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 17, 2024, 11:45 AM IST
Kala Venkat Rao Comments on Assembly Seat : తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఏం నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం ఏ బాధ్యతలు ఇచ్చినా నెరవేరుస్తానని ఆయన అన్నారు. తనకు టికెట్ రాలేదనే దానిపై కొందరు అపోహలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని అపోహలు సృష్టించినా వాటిని పట్టించుకోకుండా పార్టీ కోసం కష్టపడి పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ ఇచ్చిన బాధ్యతను తూచా తప్పకుండా పాటించనని, ఆరు సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా పని చేశానని తెలిపారు.
నియోజకవర్గంలో ఇంకా టికెట్ రాలేదని చాలా మంది అనేక విధాలుగా అపోహలు సృష్టిస్తున్నారు. ఎవరు ఎన్ని అపోహలు సృష్టించినా కార్యకర్తల్లో గందరగోళం వద్దు. పార్టీ ఇచ్చినటువంటి ప్రతి పనిని తూచా తప్పకుండా పాటించాను. చంద్రబాబు నిర్ణయమే మాకు శిరోధార్యమని కార్యకర్తలంతా చర్చించుకున్నాం. ఏ పదవిని స్వీకరించమంటే దానికి మేము సిద్ధం. చంద్రబాబు నాయుడు బాటలోనే మేమంతా నడుస్తాం. -కళా వెంకట్రావు, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు