మార్కెట్లో ఆకుకూరల్లా గంజాయి లభిస్తోంది: మాధవి - MADHAVI REDDY ON GANJA - MADHAVI REDDY ON GANJA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 16, 2024, 3:08 PM IST
Kadapa TDP MLA Candidate Madhavi Reddy On Ganja: మార్కెట్లో ఆకుకూరలు దొరికినంత ఈజీగా కడపలో గంజాయి దొరుకుతోందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి రెడ్డి ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల అండతో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతుందని విమర్శించారు. గంజాయి విక్రయాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొన్ని రోజుల క్రితం కడపలో కొందరు వ్యక్తులు గంజాయి సేవించి మహిళలపై దాడి చేశారని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. నిందితులకు పులివెందుల నేతలు రక్షణ కల్పిస్తున్నారని పేర్కొన్నారు. గంజాయి బ్యాచ్ వల్ల నగరంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాధవి మండిపడ్డారు. కొంత మంది కార్పొరేటర్లు వాలంటీర్లను రాజీనామా చేసి ప్రచారానికి రమ్మని బెదిరిస్తున్నారని తెలిసిందన్నారు. రాజీనామా చేసి వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేయకపోతే వాలంటీర్ల అంతు చూస్తామని బెదిరించినట్లు తెలిసిందన్నారు. వైఎస్సార్సీపీ నేతల మాటలు నమ్మి వాలంటీర్లు రాజీనామా చేయవద్దని సలహా ఇచ్చారు. వాలంటీర్లు రాజీనామా చేస్తే వైఎస్సార్సీపీ నేతల నుంచి ఎవరూ రక్షించలేరని మాధవి అన్నారు.