తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై సీఎం ప్రకటనను స్వాగతించిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం - Govt Employees Union on YSRCP - GOVT EMPLOYEES UNION ON YSRCP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 28, 2024, 4:30 PM IST
Govt Employees Union Suryanarayana Fire on YSRCP: వైఎస్సార్సీపీ హయాంలో ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్న సీఎం ప్రకటనపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తంచేసింది. గతంలో ఉద్యోగుల సమస్యలపై పోరాడితే తనను చంపేందుకు అప్పటి ప్రభుత్వ పెద్దలు కుట్ర చేశారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ ఆవేదన వెలిబుచ్చారు. అనంతపురంలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం సమావేశంలో సూర్యనారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రాక్షస పాలనలో ఉద్యోగులపై పెట్టిన అక్రమ కేసులను రద్దు చేసేలా అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేయడం సంతోషకర విషయమన్నారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం పోరాడితే ఆనాటి రాక్షస ప్రభుత్వం తనను చంపాలని చూసిందని గుర్తు చేసుకున్నారు. రానున్న కాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ కోరారు.