LIVE : ఖైరతాబాద్‌లో 70 అడుగులు గణేశుడు - భారీగా తరలివస్తున్న భక్తులు - Khairatabad Ganesh Puja 2024
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 7, 2024, 10:10 AM IST
|Updated : Sep 7, 2024, 7:38 PM IST
Khairatabad Ganesh Puja 2024 : ఖైరతాబాద్ గణేశుడు పూజలందుకునేందుకు సిద్ధమయ్యాడు. ఏటా అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాలలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ఉదయం తొలి పూజలు చేశారు. ఈ ఏడాది ప్రతిష్ఠించిన శ్రీ సప్తముఖ మహాశక్తి గణేశుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. కాగా పార్వతీతనయుడి ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈసారి 70 ఏళ్ల సందర్భంగా 70 అడుగుల ఎత్తులో 'సప్తముఖ మహాశక్తి' గణనాథుడిగా కొలువుదీరాడు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే వద్ద పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నవరాత్రుల సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణేశ్ మండపాల్లో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాలని సూచిస్తున్నారు. మరోవైపు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయకుడి ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలకున్న విఘ్నాలన్నీ తొలిగిపోవాలని ఆకాంక్షిస్తున్నారు.
Last Updated : Sep 7, 2024, 7:38 PM IST