హిందూపురంలో నందమూరి బాలకృష్ణ సూచన మేరకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరం - ఉచితంగా క్యాన్సర్ రోగ నిర్ధారణ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-03-2024/640-480-20889955-thumbnail-16x9-medical-camp.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 2, 2024, 8:05 PM IST
Free Cancer Screening Medical Camp in Hindupuram : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. హిందూపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, పరిశోధన కేంద్రం వారు ఈ సంచార వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. సుమారు మూడు కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో ఉచితంగా క్యాన్సర్ రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు.
నందమూరి బాలకృష్ణ అభీష్టం మేరకు నూతన సంచార వైద్య శిబిరాన్ని హిందూపురంలో ప్రారంభించినట్లు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. రెండు రోజుల పాటు కొనసాగే ఈ వైద్య సేవలను హిందూపురం నియోజకవర్గ ప్రజలు వినియోగించుకోవాలని పిలుపు నిచ్చారు. హిందూపురం నియోజకవర్గ ప్రజలు ఎవరైనా క్యాన్సర్ బాధితులు, అనుమానంతో ఉన్న వారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. రెండు రోజుల పాటు వైద్య సేవలను అందిస్తామని, ఈ కార్యక్రమాన్ని బాధితులు విజయవంతం చేయాలని కోరుకున్నారు.