LIVE: సీఎం జగన్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మీడియా సమావేశం - మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-01-2024/640-480-20599315-thumbnail-16x9-former-minister-nakka-anand-babu-live.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 26, 2024, 5:11 PM IST
|Updated : Jan 26, 2024, 5:16 PM IST
Former Minister Nakka Anand Babu live: వైఎస్ కుటుంబంలో చీలికలు అనేవి జగన్ స్వయంకృతమే అని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అభిప్రాయపడ్డారు. అభివృద్ధి లేకుండా రాష్ట్రం దయనీయ స్థితిలో ఉందంటే దానికి కారణం సీఎం జగనేనని నిప్పులు చెరిగారు. తిరుపతిలో ఇండియా టుడే విద్యాసదస్సులో పాల్గొన్న జగన్ ఏపీని, తన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందని జగన్ అన్నారు. కానీ వైఎస్ కుటుంబం చీలిందంటే దానికి కారణం చేజేతులా జగనన్న చేసుకున్నదే అని జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన వైఎస్ షర్మిల లేవనెత్తారు. అందుకు సాక్ష్యం దేవుడు, తన తల్లి విజయమ్మ అని ఆమె పేర్కొన్నారు. జగన్ వైఖరి వల్లే వైఎస్ కుటుంబం విడిపోయిందని టీడీపీ నేతలు ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను నిలబెడతారని జగన్‌ను ప్రజలు సీఎం చేశారని వైఎస్ వారసులమని చెప్పడం కాదు పని తీరులో కనపడాలని ఆనంద్ బాబు తెలిపారు. వైఎస్ కుటుంబంలోని చీలికలపై టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మీడియా సమావేశం.