కష్టాలు తీర్చలేని ప్రభుత్వం దిగిపోవాలి - ఫిరంగిపురంలో నీటి కోసం ఆందోళన - Water Problem in Phirangipuram
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 12, 2024, 7:16 PM IST
Drinking Water Problems in Phirangipuram : తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో తెలుగుదేశం నాయకులు, ప్రజలు ఆందోళన చేపట్టారు. పార్టీ కార్యాలయం నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ (Rally) నిర్వహించారు. మంచినీటి కష్టాలు తీర్చలేని ప్రభుత్వం వెంటనే దిగి పోవాలంటూ నినాదాలు (Slogans) చేశారు. తాగునీటి సమస్య తీర్చాలంటూ ఎమ్మార్వో (MRO) కు, అసిస్టెంట్ ఇంజినీర్ శ్రీనివాస రావుకు వినతి పత్రం అందజేశారు.
'నల్లాలు వేసి కూడా నీళ్లు విడవడం లేదు. విడిచినా సరిపోయే విధంగా నీరు అందించడం లేదు. ఎనిమిది రోజులకు ఒకసారైనా నీళ్లు వచ్చేవి. ఇప్పుడు అది కూడా ఇవ్వడం లేదు. దగ్గరలోని చెరువులో నీరు తెచ్చుకుంటున్నాం. ఆ నీరు స్వచ్ఛంగా లేక జ్వరాల బారిన పడుతున్నాం. అధికారులకు చెప్తే ట్యాంకర్ పంపిస్తాం అంటారు కానీ పంపడం లేదు.' - బాధితులు
ఇప్పటికైనా కనీస అవసరాలకు సరిపోయే విధంగా నీరు అందించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.