అనంతలో అనుమతులు లేని ప్రైవేటు క్లినిక్‌లు సీజ్ - DMHO Inspection in clinic
🎬 Watch Now: Feature Video
DMHO Inspection in Private Clinics in Anantapur District : అనంతపురం జిల్లా రాయదుర్గంలో అనుమతులు లేని ప్రైవేటు క్లినిక్‌లను జిల్లా వైద్యాధికారులు సీజ్ చేశారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఆర్ఎంపీ (RMP) డాక్టర్ల క్లినిక్‌లను జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. రోగులకు ఆర్ఎంపీ (RMP) వైద్యులు శస్త్ర చికిత్సలు, రక్త, మలమూత్ర పరీక్షలు చేసి వైద్యం అందిస్తున్నట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయని వైద్యాధికారి భ్రమరాంబికా దేవి తెలిపారు. స్థానిక ప్రజల ఫిర్యాదు మేరకు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేటు క్లినిక్‌లను సీజ్ చేశారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్వో బీబీ దేవి మాట్లాడుతూ రాయదుర్గం ప్రాంతంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా క్లినిక్‌లు ఉన్నాయని ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. ఆర్ఎంపీ వైద్యులు ఫస్ట్ ఎయిడ్ చేసి రోగులను ఆసుపత్రులకు పంపించాల్సి ఉంది. కానీ రాయదుర్గం పట్టణంతోపాటు అన్ని మండలాల్లో ఆర్ఎంపీ వైద్యులు ఇంజక్షన్లు వేయడం, గ్లూకోజ్ బాటిల్స్ పెట్టడం, చంటి పిల్లలకు వైద్యం అందించడం వంటివి జరుగుతుందని తమ తనిఖీల్లో వెల్లడైందన్నారు.