Live: దేవినేని ఉమ మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - Devineni Uma Press Meet live - DEVINENI UMA PRESS MEET LIVE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-04-2024/640-480-21271995-thumbnail-16x9-devineni.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 20, 2024, 3:08 PM IST
|Updated : Apr 20, 2024, 3:21 PM IST
Devineni Uma Press Meet live: ఇళ్ల వద్దే పింఛన్లు ఇచ్చే ఏర్పాట్లు అంశంపై టీడీపీ నేత దేవినేని ఉమ మీడియా సమావేశం నిర్వహించారు. పింఛన్ల పంపిణీ సజావుగా జరిగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో పాటుగా అంతరికీ ఇంటింటా పింఛన్లు అందేలా చూడాలన్నారు. వాలంటీర్లను పక్కనపెట్టడంతో, పింఛను అందుకోవడానికి వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారన్న వాదనను దేవినేని తోసిపచ్చారు. దేశంలో వాలంటీర్ వ్యవస్థ లేని మిగిలిన రాష్ట్రాల్లోనూ పింఛన్ల పంపిణీ జరుగుతోంది కదా, అక్కడ ప్రజలే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పెన్షన్లు తీసుకుంటున్నారు కదా అని అంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. కానీ, వైసీపీ ప్రభుత్వానికి అధికారులు సహకరిస్తున్నారని , పింఛన్ పంపిణీలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం పింఛన్ పంపిణీపై అసత్య ప్రచారం చేస్తుందని ఆరోపించారు. ఎన్నికల సంఘం పింఛన్ పంపిణీపై సత్వర నిర్ణయం తీసుకొని వైసీపీ అసత్య ప్రచారాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లతో కాకుండా ప్రభుత్వాధికారులే పింఛన్ పంపిణీ చేయాలని పేర్కొన్నారు. త్వరలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ పెంపుదల చేస్తామని వెల్లడించారు.
Last Updated : Apr 20, 2024, 3:21 PM IST