విజయనగరంలో విషాదం - విద్యుదాఘాతంతో దంపతులు మృతి - Couple died due to electric shock - COUPLE DIED DUE TO ELECTRIC SHOCK
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 5, 2024, 9:55 PM IST
Couple Died Due to Electric Shock: విజయనగరం జిల్లా మెంటాడ మండలం మీసాలపేటలో కరెంట్ షాక్‌తో భార్యాభర్త మృతి చెందారు. పొలంలో పడిపోయిన విద్యుత్తు తీగలు తగిలి కోరాడ ఈశ్వరరావు, కోరాడ ఆదిలక్ష్మి ప్రాణాలు కోల్పోవడం గ్రామంలో విషాదం నింపింది. వరి నారుమడికి నీళ్లు పెట్టడానికి ఈశ్వరరావు ఉదయాన్నే పొలానికి వెళ్లారు. ఎంతకీ ఇంటికి రాకపోవటంతో ఆయన భార్య ఆదిలక్ష్మి పొలం వద్దకు వెళ్లారు. విగతజీవిగా పడి ఉన్న భర్తను పైకి లేపేందుకు ప్రయత్నించి ఆమె కూడా విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు.
భార్య, భర్తలు మృతికి విద్యుత్ శాఖాధికారులే కారణమని, మృత్యుల బంధువులు, గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గత నెల 14న ఈదురు గాలుల కారణంగా గ్రామంలో పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయని అన్నారు. ఆ సమయంలో విద్యుత్తు తీగలు తెగిపోయాయని, విద్యుత్తు శాఖ సిబ్బంది తీగలను పూర్తిగా తొలగించకుండా పొలాల్లో వదిలేశారని తెలిపారు. వాటి ద్వారా విద్యుత్తు ప్రవహించి, భార్య, భర్తలు మృతి చెందారని గ్రామస్థులు పేర్కొన్నారు. విద్యుత్ షాక్‌తో భార్యాభర్తలు చనిపోయిన ఘటనపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఘటన కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.