'ముందస్తు పరీక్షలతో క్యాన్సర్ నియంత్రణ సాధ్యం- ఆహార అలవాట్లలో మార్పులు తప్పనిసరి' - Cancer Specialist Noori Dattatreya - CANCER SPECIALIST NOORI DATTATREYA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 2, 2024, 12:42 PM IST
F2F With Cancer Specialist Noori Dattatreya in East Godavari : క్యాన్సర్‌ను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే 98 శాతం నయం అవుతుందని ప్రఖ్యాత క్యాన్సర్ నిపుణుడు నోరీ దత్తాత్రేయుడు అన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో దైనందిన జీవితాన్ని కొనసాగించవచ్చని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని జీఎస్ఎల్(GSL) వైద్యకళాశాల, జనరల్ ఆసుపత్రిలో డాక్టర్స్ డే సందర్భంగా సోమవారం నిర్వహించిన సమావేశానికి హాజరైన ఆయన ఈటీవీ, ఈటీవీ భారత్‌తో మాట్లాడారు. వంశపారంపర్య లక్షణాలు, రోజుల తరబడి తగ్గని వ్యాధులను గుర్తించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
దేశంలో క్యాన్సర్‌తో రోజూ 1600 మంది దాకా చనిపోతున్నారని నోరి దత్తాత్రేయుడు పేర్కొన్నారు. ఇందులో 200 మంది దాకా మహిళలు ఉన్నారని తెలిపారు. అనేక సార్లు వాడిన వంటనూనెలు మరల వినియోగించడం వల్ల కూడా క్యాన్సర్ రావడానికి కారణం కావచ్చు అని పేర్కొన్నారు. క్యాన్సర్ బారిన పడకుండా రోజూ కూరగాయలు, ఆకు కూరలను బాగా వినియోగించాలని సూచించారు. కాన్సర్ నిర్మూలన అంటే జబ్బు వచ్చాక తగ్గించుకోవడం మాత్రమే కాదు, రాకముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. క్యాన్సర్‌పై అవగాహన పెంచుకుని ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచనలు చేశారు.