ఏపీలో ఆర్థికశాఖ మంత్రి లేరు - కేవలం అప్పుల శాఖ మంత్రే ఉన్నారు : భానుప్రకాష్ రెడ్డి - Bhanu Prakash Reddy fire on jagan - BHANU PRAKASH REDDY FIRE ON JAGAN
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 12, 2024, 7:44 PM IST
BJP Leader Bhanu Prakash Reddy Fires on AP CM Jagan : మద్య నిషేధం అని చెప్పి జగన్ మోహన్ రెడ్డి వేల కోట్లు దోచుకున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన జె బ్రాండ్ మద్యంతో ప్రజల ఆరోగ్యం పాడవుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలను వైసీపీ నేతలు వాటాలు అడుగుతుండటంతో వారు వెనక్కి వెళ్లిపోతున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో డబ్బు, దొంగ ఓట్లతో గెలవాలని జగన్ చూస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలో ఆర్థిక శాఖ మంత్రి లేరు, కేవలం అప్పుల శాఖ మంత్రే ఉన్నారని ఎద్దేవా చేశారు.
2019వ సంవత్సరం నాటికి రాష్ట్ర అప్పులు రూ. 3.30 లక్షల కోట్లు ఉండేది. అదే 2024 సంవత్సరం వచ్చేసరికి రూ.12 లక్షల కోట్లకు చేరిందని విమర్శించారు. కేవలం అప్పులకే ప్రతి సంవత్సరం 70 నుంచి 80 వేల కోట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. ప్రజాధనం మెుత్తం వడ్డీలకే పోతుంటే ఇక అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర జగన్‌కి చివరి యాత్ర అని భాను ప్రకాష్ రెడ్డి జోస్యం చెప్పారు.