రాష్ట్రాన్ని దోచుకోవడానికే జగన్ సిద్ధం అంటున్నారు- భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు - Bode Ramachandra fires on jagan - BODE RAMACHANDRA FIRES ON JAGAN
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-03-2024/640-480-21053283-thumbnail-16x9-bharat-chaitanya-yuvajana-party-president-bode-ramachandra-yadav-allegations.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 23, 2024, 12:17 PM IST
Bharat Chaitanya Yuvajana Party President Bode Ramachandra Yadav Allegations: జగన్ ఐదేళ్లుగా అరాచకాలు, అవినీతికి పాల్పడ్డారని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ఆరోపించారు. పుంగనూరు నియోజకవర్గం (punganooru Constituency) నుంచి పోటీ చేసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించటమే తన లక్ష్యమని రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను త్వరలోనే ప్రకటిస్తానని ప్రజలంతా తమను ఆదరించి గెలిపించాలని రామచంద్ర యాదవ్ కోరారు.
జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) 5 ఏళ్లు రాష్ట్రాన్ని లూటి చేసి, రాష్ట్రంలో ఏమైనా మిగిలి ఉంటే దోపిడికి చేయడానికి ఇంకొక్కసారి అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారని రామచంద్ర యాదవ్ ఎద్దేవ చేశారు. సిద్ధం అంటూ ప్రజలను మభ్యపెట్టే యోచనలో జగన్ ఉన్నారని మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి బినామీల ఆధీనంలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్ కంపెనీ పనిచేస్తోందని రామచంద్ర యాదవ్ ఆరోపించారు. గత ఐదేళ్లుగా పోలవరం ప్రాజెక్ట్‌లో సీఎం జగన్ వేల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.