సౌదీ నుంచి వీరేంద్రకుమార్‌ను తీసుకొచ్చేందుకు చర్యలు- బాధితుడి కుటుంబ సభ్యులతో ఆర్డీవో - SaudiArabia victim - SAUDIARABIA VICTIM
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 22, 2024, 9:27 AM IST
AP Govt Steps Taken to Bring Virendra Kumar from SaudiArabia : ఏజెంట్ చేతిలో మోసపోయి సౌదీ అరేబియాలో ఎడారి జీవితం గడుపుతున్న కోనసీమ జిల్లాకు చెందిన సరేళ్ల వీరేంద్రకుమార్ తల్లిదండ్రులను కొత్తపేట ఆర్డీవో పరామర్శించారు. ఇసుకపూడిలో బాధితుడి తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. భారత రాయబార కార్యాలయం ద్వారా వీరేంద్రకుమార్‌ను ఇంటికి తీసుకువచ్చి అప్పగిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ వి.మహేష్ కుమార్ ఆదేశాలతో తాను వచ్చినట్లు ఆర్డీవో వెల్లడించారు. వీరేంద్రను దేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఆర్డీవో వివరించారు. మంత్రి లోకేశ్ సైతం స్పందించి బాధితుడిని క్షేమంగా రాష్ట్రానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కొద్ది రోజుల క్రితం ఖతార్లో ఉద్యోగం ఇప్పిస్తానన్న నకిలీ ఏజెంట్ మాటలు నమ్మి మోసపోయానని వీరేంద్రకుమార్ ఎక్స్ వేదికగా వీడియో పోస్ట్ చేశారు. ఈ విషయం పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో విసృతంగా ప్రచారం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్రప్రభుత్వం ఇప్పటికే కేంద్రరాయబార కార్యాలయాన్ని సంప్రదించినట్లు తెలుస్తోంది.