LIVE: ఏపీ అసెంబ్లీ సమావేశాలు - ప్రత్యక్షప్రసారం - AP Assembly Sessions 2024 - AP ASSEMBLY SESSIONS 2024
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 24, 2024, 2:17 PM IST
|Updated : Jul 24, 2024, 3:53 PM IST
AP ASSEMBLY SESSIONS 2024 LIVE: కేవలం రాజకీయ కారణాలతో జగన్ ప్రభుత్వం ఆరోగ్య వర్శిటీకి ఎన్టీఆర్ పేరును మార్చిందని ఆరోగ్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. పేరు మార్పు వల్ల అనేక వర్సిటీలో అడ్మిషన్లకు, విదేశాల్లో ఉన్నత విద్యకు వెళ్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మహనీయుడైన ఎన్టీఆర్ పేరు మార్చాలనే ఆలోచన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఎలా వచ్చిందోనని దుయ్యబట్టారు.ఆరోగ్య వర్శిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లుపై మంత్రి సత్యకుమార్ నేడు శాసనసభలో చర్చించారు. విజయవాడలో యూనివర్శిటీ ఆఫ్ హెల్త్‌సైన్సెస్‌కు ఎన్టీఆర్ పేరు తొలగించి, వైఎస్సార్ పేరు పెడుతూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణ రద్దు చేసే బిల్లుపై అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చను ఎమ్మెల్సీలు ఆసక్తిగా పరిశీలించారు. శాసనమండలి లాబీల్లో హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్దరణపై తెలుగుదేశం ఎమ్మెల్సీల మధ్య చర్చ జరిగింది. హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టిన నాటి రోజులను మండలి టీడీపీ శాసనసభాపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు గుర్తు తెచ్చుకున్నారు. కొన్ని పేర్లను మార్చడం తప్పని వ్యాఖ్యానించారు.
Last Updated : Jul 24, 2024, 3:53 PM IST