రాజధానిని నిర్మించగలిగిన రాజకీయ పార్టీనే అధికారంలోకి రావాలి: అమరావతి రైతులు - Farmers Campaign Defeat Jagan
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 12, 2024, 9:42 AM IST
Amaravati Farmers Campaign to Defeat CM Jagan: రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన సీఎం జగన్‌ను రానున్న ఎన్నికల్లో ఓడించాలని కోరుతూ అమరావతి రైతులు ప్రచారాన్ని ప్రారంభించారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో రాజధాని రైతులు, మహిళలు ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. సంపదను సృష్టించకుండా రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో సీఎం జగన్ చెప్పాలని రాజధాని రైతులు ప్రశ్నించారు. మూడు రాజధానుల నిర్ణయంతో సీఎం జగన్ అమరావతిని విచ్ఛిన్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు
Farmers To Defeat CM Jagan in Upcoming Elections: సుస్థిరమైన రాజధాని నగరం ఉన్నప్పుడే ప్రగతి సాధ్యమవుతుందని రైతులు పేర్కొన్నారు. సీఎం జగన్ అసమర్థ నిర్ణయాలతో ఆంధ్రప్రదేశను వెనుకబడిన రాష్ట్రంగా మారుస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని ప్రజలు ఎన్నుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారంలోకి పోతుందని రైతులు విమర్శించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రమంతా కూడా పర్యటించి ప్రచారం చేపడతామని రైతులు తెలిపారు.