ప్రిన్సిపల్ సెక్రటరీలతో సీఎస్ సమావేశం- ఈసీ నిబంధనలకు విరుద్ధం: అచ్చెన్నాయుడు - Achchennaidu Letter to CEO - ACHCHENNAIDU LETTER TO CEO
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 24, 2024, 8:29 PM IST
Achchennaidu Letter to Chief Electoral Officer Meena: ఎన్నికల నిబంధనలకు విరుద్దమైన అంశాలపై ఈసీ అనుమతి కోసం ఈ నెల 22, 23 తేదీలలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీపీఎం, ఏఆర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలతో సమావేశం ఏర్పాటు చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆయన లేఖ రాశారు. సమావేశం అజెండాలోని అనేక అంశాలు ఎన్నికల నియమావళికి విరుద్ధమని మండిపడ్డారు. టెట్ పరీక్షా ఫలితాలు ప్రకటించేందుకు అనుమతించాలని కోరడాన్ని తప్పుబట్టారు. 6,100 డీఎస్సీ పోస్టులు భర్తీ చేసేందుకు అనుమతించాలని కోరడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ డైరక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డీవీ. సుప్రకాష్‌ను జాయింట్ డైరక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌గా పదోన్నతి కల్పించేందుకు అనుమతించమనడాన్ని ఖండించారు. డా.ఎస్.కే సలీం బాషాను గుంటూరు జిల్లా, బోయపాలెం డైట్ ప్రిన్సిపాల్‌గా నియమించేందుకు అనుమతించాలని కోరడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా దాదాపు 30కి పైగా ఎన్నికల నిబంధనలకు విరుద్దమైన అనుమతుల కోసం అజెండాలో చేర్చారని ధ్వజమెత్తారు.
తాడేపల్లిలో వైసీపీ మాజీ ఎంపీపీ భవన్‌పై ఉన్న జగన్ కటౌట్‌ను నేటికి తొలగించలేదని గుంటూరు జిల్లా ఎన్నికల అధికారికి టీడీపీ సీనియర్ నేత ఎం.ఏ షరీఫ్ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. కటౌట్‌ను తొలగించేలా మంగళగిరి- తాడేపల్లి మునిసిఫల్ కమీషనర్‌కు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై గుంటూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంటనే స్పందించాలని కోరారు.