ETV Bharat / state

టిడ్కో లబ్ధిదారులకు బ్యాంకర్ల నోటీసులు- 'ఇళ్లు ఇవ్వకుండా వాయిదా ఎలా కట్టాలి?' - TIDCO Beneficiaries Facing Problems - TIDCO BENEFICIARIES FACING PROBLEMS

YSRCP Took Loans TIDCO Beneficiaries Facing Problems in Krishna District : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్వాకం టిడ్కో లబ్ధిదారులకు శాపంగా మారింది. ఇళ్ల నిర్మాణం పేరుతో గత ప్రభుత్వం తీసుకున్న రుణాలు లబ్ధిదారుల మెడకు చుట్టుకుంటున్నాయి. బ్యాంకుల నుంచి నోటీసులు వస్తుండటంతో టిడ్కో లబ్ధిదారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వం తమ పేరు మీద తీసుకున్న రుణాలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ysrcp_took_loans_tidco_beneficiaries_problems
ysrcp_took_loans_tidco_beneficiaries_problems (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 30, 2024, 12:29 PM IST

YSRCP Took Loans TIDCO Beneficiaries Facing Problems in Krishna District : కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణ పరిధిలోని జెమిని స్కూల్, ఎగినపాడు, గండిగుంటలో గత తెలుగుదేశం ప్రభుత్వం 2 వేల 500కు పైగా టిడ్కో గృహాలు మంజూరు చేసింది. ఉయ్యూరులోని తొమ్మిది బ్యాంకుల నుంచి వెయ్యి మందికి పైగా టిడ్కో లబ్ధిదారుల పేరుతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ. 25 కోట్ల 67 లక్షల రుణం తీసుకుంది. వాటి తాలూక ఈఎమ్​ఐలు చెల్లించాలని లేకుంటే చర్యలు తప్పవంటూ బ్యాంకర్లు లబ్ధిదారులకు ఫోన్లు, మెసేజ్​లు పంపిస్తున్నారు. తాజాగా లీగల్‌ నోటీసులు సైతం జారీ చేస్తుండటంతో టిడ్కో లబ్ధిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు అందిస్తారో తెలియని ఇళ్లకు రుణ వాయిదాలు ఎలా చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు.

టిడ్కో ఇళ్ల కోసం బ్యాంకుల నుంచి లబ్ధిదారులు పాక్షిక ఒప్పందం చేసుకుంటే రుణం మంజూరు చేసినట్లే. నాటి నుంచి రెండేళ్ల వరకు లబ్ధిదారులు వాయిదాలు చెల్లించనవసరం లేదు. ఆ గడువు కొంత మందికి ఇప్పటికే పూర్తి కావడంతో బ్యాంకుల నుంచి నోటీసులు అందుతున్నాయి. ఒకటి రెండు వాయిదాలు చెల్లించకపోతే డిఫాల్టర్లుగా మారతారని బ్యాంకర్లు హెచ్చరిస్తుండటంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము రుణాలు కట్టలేమని బ్యాంకు అధికారులకు చెప్తున్నా పట్టించుకోవడం లేదని మహిళలు వాపోతున్నారు. రుణాలిచ్చి, ఇళ్లు ఇవ్వకుండా బ్యాంకులు వేధింపులకు దిగడం సరికాదంటున్నారు.

టిడ్కో ఇళ్లలో లబ్ధిదారుల పాట్లు - ఓ వైపు బ్యాంకుల నుంచి ఒత్తిళ్లు, మరోవైపు సదుపాయాల కరవు - Problems of Tidco Houses Residents

'బ్యాంక్​ వాళ్లు ఇప్పటికే మాకు రెండుసార్లు నోటీసులు పంపించారు. ఇటు అద్దెలు కడుతూ అటు ఎప్పుడు ఇస్తారో తెలియని ఇళ్లకి ఇప్పటి నుంచే ఈఎమ్ఐలు ఎలా కడతాం. డబుల్​ బెడ్​రూం ఇళ్లకోసం గత ప్రభుత్వంలో రూ. 25 వేలు, కూటమి ప్రభుత్వ వచ్చాక రూ. 25 వేలు కట్టాం. బ్యాంక్​ వాళ్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. సంతకాలు ఎందుకు పెట్టారని హెచ్చరిస్తున్నారు.' -బాధితులు

టిడ్కో ఇళ్లు వస్తున్నాయిలే అని సంబరపడ్డ లబ్ధిదారులు అప్పులు తెచ్చిమరీ డిపాజిట్లు చెల్లించారు. కూటమి ప్రభుత్వంలోనైనా తమకు ఇళ్లు వస్తాయని లబ్ధిదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఖజానా ఊడ్చేసింది - ఏ పని చేయాలన్నా రూపాయి లేదు: మంత్రి నారాయణ - NARAYANA ON TIDCO HOUSES

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.