ETV Bharat / state

గెలుపు కోసం వైఎస్సార్​సీపీ కుతంత్రాలు - ప్రలోభాలతో కొత్త ఎత్తుగడలు - YSRCP Temptation Offers for Voters - YSRCP TEMPTATION OFFERS FOR VOTERS

YSRCP Tempting Voters Making Efforts to Win Elections: రాష్ట్రంలో ప్రజలు, రాజకీయ నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పోలింగ్​కు సమయం వచ్చింది. దీంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. వాలంటీర్లను సైతం బలవతంగా రాజీనామా చేయించి ఎన్నికల్లో ఉపయోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు వైఎస్సార్​సీపీ నేతలు. మరోవైపు పోలీసుల తనిఖీల్లో భారీగా నగదును స్వాధీనం చేసుకుంటున్నారు.

YSRCP Tempting Voters
YSRCP Tempting Voters (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 10, 2024, 9:46 PM IST

గెలపు కోసం వైసీపీ కుతంత్రాలు- ప్రలోభాలతో కొత్త ఎత్తుగడలు (ETV Bharat)

YSRCP Tempting Voters Making Efforts to Win Elections: మరో మూడు రోజుల్లో పోలింగ్​ జరగనుండటంతో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైఎస్సార్​సీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నోట్ల కట్టలు భారీగా దొరికాయి. ఒంగోలు నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అధికార పార్టీ నేతలు చేస్తున్న బియ్యం పంపిణీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు ఓటర్లను భయపెట్టి తమవైపు తిప్పుకునేందుకు వైఎస్సార్​సీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారు.

వైఎస్సార్సీపీకి ముచ్చెమటలు - అధికారం ఎవరిదో తేల్చేసిన సర్వేలు - ANDHRA PRADESH PEOPLE FAVOUR TO NDA

ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నాలు: ఎన్టీఆర్​ జిల్లా తిరువూరు 18వ వార్డు కౌన్సిలర్‌ పద్మ నీలిమ భర్త, వైఎస్సార్​సీపీ నేత దారా శ్రీనివాసరావు నివాసంలో 31 లక్షల రూపాయలను ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ అధికారులు పట్టుకున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు నగదు సిద్ధం చేశారని తెలుస్తోంది. శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కంచికచర్ల మండలం గని ఆత్కూరులో వైఎస్సార్​సీపీ నేతలు రెచ్చిపోయారు. ఇటీవల వైఎస్సార్​సీపీని వీడి తెలుగుదేశంలో చేరిన చలపాటి వంశీకృష్ణ, అన్వేష్‌పై దాడికి తెగబడ్డారు. గ్రామానికి చెందిన నలుగురు వైఎస్సార్​సీపీ కార్యకర్తలు బొడ్రాయి సెంటర్లో ఇద్దరినీ దారుణంగా కొట్టారు. తెలుగుదేశానికి ప్రచారం చేస్తే చంపేస్తామని బెదిరించినట్లు బాధితులు వాపోయారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓ వస్త్ర, వడ్డీ వ్యాపారి ఇంటిపై దాడి చేసిన ఆదాయ పన్ను శాఖ అధికారులు 25 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బులు అధికార పార్టీకి చెందిన వ్యక్తివిగా గుర్తించినట్లు సమాచారం.

కృష్ణా జిల్లాలో వైఎస్సార్​సీపీ నేతల అరాచకం - టీడీపీ జెండాలను తొలగించి కార్యకర్తలపై దాడి - YCP leaders attack on TDP

YCP Leaders Distribute Rice Bags: ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు వైఎస్సార్​సీపీ నేతలు వినూత్న ప్రయత్నాలు చేశారు. ఇన్నాళ్లూ ఓటుకు 3000, చీరలు, గృహోపకరణాలు పంపిణీ చేసిన అధికార పార్టీ నాయకులు బియ్యంతో కూడా ఎర వేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో గురువారం రాత్రి ఆటోల్లో వచ్చి ఇంటింటికీ బియ్యం పంపిణీ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రెండు వాహనాలు, వందల సంఖ్యలో బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో వైఎస్సార్​సీపీ నేతలు మరో కొత్త ఎత్తుగడ వేశారు. తెల్లారేసరికి నోట్లతో వ్యవహారాన్ని నడిపించారు. వాలంటీర్లు ఓటరు లిస్టు పట్టుకుని ఇంటింటికీ వెళ్లి 50, 10 రూపాయల నోట్లు పంపిణీ చేశారు. ఎవరికి ఏ నోట్ ఇచ్చారో ఆ సీరియల్ నెంబర్ రాసుకున్నారు. ఆ నోటు తీసుకుని వారు చెప్పిన రైస్ స్టోర్‌కి వెళ్లి నోటు ఇచ్చి బస్తా తీసుకువెళ్లడమే.

ఆ దుకాణదారుడు నోటు సీరియల్ నెంబర్ రాసుకొని వైఎస్సార్​సీపీ వాళ్లకు లెక్క చూపిస్తారు. ఓటుకు ఒక బస్తా ఎన్ని ఓట్లు ఉంటే అన్ని బస్తాలు అంటే నేరుగా ఎక్కడా వైఎస్సార్​సీపీ నేతలు సీన్‌లో ఉండకుండా కథ నడిపించారు. రెండ్రోజుల క్రితం ఒంగోలులో అధికార పార్టీ నాయకులు ఓటుకు 2 వేల రూపాయల చొప్పున పంచారని జోరుగా ప్రచారం సాగింది. దర్శిలో పోస్టల్ బ్యాలెట్‌కు రూ.5 వేలు చొప్పున పంచారనే ఆరోపణలు ఉన్నాయి. మరికొందరు నాయకులు యూపీఏ చెల్లింపులు కూడా చేపట్టారు. ఇలా డబ్బులు, బహుమతుల పంపిణీతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అధికార పార్టీ వాళ్లు తెగించారు. ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు వచ్చి చూసినా అరకొర కేసులు మాత్రమే పెడుతున్నారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంలో ఈసీ కీలక ఆదేశాలు - పార్టీ అభ్యర్థులు ధ్రువీకరించాలని స్పష్టం

YSRCP Forced on Volunteer Resign: ఎన్నికల్లో వాలంటీర్లను వాడుకునేందుకు వైఎస్సార్​సీపీ కొత్త కుట్రలకు తెరలేపింది. ప్రకాశం జిల్లా కనిగిరిలో జిల్లా కో-ఆర్డినేటర్ పేరుతో మున్సిపాలిటీ పరిధిలోని వాలంటీర్లను వైఎస్సార్​సీపీ కార్యాలయంలోకి రప్పించి రహస్యంగా సమావేశం నిర్వహించారు. అక్కడ వాలంటీర్లను రాజీనామా చేయాలని వైఎస్సార్​సీపీ నేతలు బెదిరించినట్లు తెలుస్తోంది. అలా బహిరంగంగా 49 మందితో, రహస్యంగా సుమారు 150 మందితో రాజీనామా పత్రాలు సమర్పించేలా చేశారు. పైగా రాజీనామా చేసిన వాలంటీర్లకు ఒక్కొక్కరికీ 5 వేల చొప్పున నగదు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంటింటికీ వెళ్లి తాయిలాలు పంచేందుకు వైఎస్సార్​సీపీ నేతలు వాలంటీర్లను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Police Seized the Money: శ్రీసత్యసాయి జిల్లా అమరాపురం మండలం మద్దనకుంట చెక్‌పోస్ట్‌ వద్ద తనిఖీల్లో భాగంగా పోలీసులు 38 లక్షల రూపాయలు పట్టుకున్నారు. కర్ణాటకకు చెందిన మంజునాథ్‌ అనే వ్యక్తి కారులో సోదాలు చేస్తుండగా నగదు బయట పడింది. ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో నగదు సీజ్‌ చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తూ కనగానపల్లె మండలంలో వైఎస్సార్​సీపీ నేతలు ఇంటింటికీ సిద్ధం స్టిక్కర్లు అంటిస్తున్నారు. తనయనపల్లి, సోమవారంపల్లితో పాటు పలు గ్రామాల్లో రాత్రికి రాత్రే స్టిక్కర్లు అంటించినట్లు తెలుస్తోంది. దీనిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కనిగిరిలో వైఎస్సార్సీపీ నేతల బరితెగింపు - రాజీనామా చేయని వాలంటీర్లకు బెదిరింపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.