ETV Bharat / state

రైతులను నిలువునా దోచేసిన వైఎస్సార్సీపీ నేతలు - రూ.350 కోట్లకు గండి - SCAM IN GUNTUR MIRCHI YARD

గుంటూరు మిర్చి యార్డులో వైఎస్సార్సీపీ నేతల అక్రమాలు - అన్నదాతల కడుపు కొడుతూ అందినకాడికి దోపిడీ

scam_in_guntur_mirchi_yard
scam_in_guntur_mirchi_yard (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 3, 2024, 7:53 PM IST

YSRCP Leaders Irregularities in Guntur Mirchi Yard: అవినీతికి కాదేదీ అనర్హం అన్నట్లు ప్రతీ రంగంలోనూ గత ఐదేళ్లూ వైఎస్సార్సీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారు. ఆఖరికి గుంటూరు మిర్చి యార్డునీ వదల్లేదు. అన్నదాతల కడుపు కొడుతూ అందినకాడికి దోచుకున్నారు. మిర్చి యార్డులో భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ విచారణలో బయటపడింది. రైతులను మోసగిస్తూ వైఎస్సార్సీపీ నేతలు ఏవిధంగా అవినీతికి పాల్పడ్డారు. ఎన్ని కోట్లు మేసేశారని తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే.

అక్రమార్జనకు కల్పతరువుగా మిర్చి యార్డు : వైఎస్సార్సీపీ నేతల అక్రమార్జనకు గుంటూరు మిర్చి యార్డు కల్పతరువుగా మారింది. జగన్ హయాంలో యార్డులో భారీగా అక్రమాలు జరిగాయని టీడీపీ నాయకుడు, మిర్చి యార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించడంతో కఠోర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గత ఐదేళ్లలో భారీ అక్రమాలు జరిగినట్లు తేల్చిన అధికారులు విజిలెన్స్ నివేదికను ప్రభుత్వానికి పంపారు. సరకు అమ్ముకోవడానికి వచ్చిన రైతులను వైఎస్సార్సీపీ నేతలు నిలువునా దోచుకున్నట్లు గుర్తించారు.

అన్నదాతల నుంచి 2 శాతం మాత్రమే అగ్రికల్చర్‌ సెస్‌ తీసుకోవాల్సి ఉండగా 4 నుంచి 5 శాతం మేర వసూలు చేసినట్లు విజిలెన్స్‌ పరిశీలనలో తేలింది. ఈనాం నిబంధనలకు పాతరేశారని పన్నుల రూపేణా ప్రభుత్వానికి దాదాపు రూ. 350 కోట్లు గండి కొట్టారని నివేదికలో పేర్కొన్నారు. ఒక్క జీఎస్టీ రూపేణా రూ. 289 కోట్లు, మార్కెటింగ్‌ సెస్‌ ఫీజుల రూపేణా రూ. 58 కోట్ల ఆదాయం కోల్పోయినట్లు వివరించారు. నాటి మిర్చి యార్డు ఛైర్మన్, వైఎస్సార్సీపీ నాయకుడు సుధాకర్‌రెడ్డి ఇష్టానుసారం వ్యాపారులకు లైసెన్సులు మంజూరు చేసి లంచాలు తీసుకున్నారని గుర్తించిన అధికారులు ఆయనపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు.

నిర్మించని గృహాలన్నీ రద్దు - ఏపీ మారిటైమ్ పాలసీకి కేబినెట్‌ ఆమోదం

బినామీల పేరుతో సరకు కొనుగోళ్లు: 2019-24 మధ్య పని చేసిన యార్డు కార్యదర్శులు, సూపర్‌వైజర్లు, అసిస్టెంట్‌ సెక్రటరీలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇలా 20 మంది ఉద్యోగులు అక్రమాల్లో పాలు పంచుకున్నారు. రైతులను దోచుకోవటమే లక్ష్యంగా వ్యాపారుల అక్రమాలకు ఉద్యోగులు వంతపాడారు. విధులు పారదర్శకంగా నిర్వహించలేదని యార్డు ఆదాయానికి గండికొట్టేలా వ్యవహరించారంటూ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. వాస్తవంగా 7 లక్షలకు పైబడి వ్యాపార టర్నోవర్‌ ఉంటే సంబంధిత వ్యాపారి ఐటీ చెల్లించాలి. దాని నుంచి తప్పించుకోవటానికి వ్యాపారులు తెలివిగా తమ కుటుంబీకుల పేరుతోనే బినామీ లైసెన్సులు పొంది వారి పేరుతో సరకు కొనుగోళ్లు చేయించి ఐటీ పడకుండా తప్పించుకున్నట్లు గుర్తించారు.

మిర్చి యార్డులో 2 వేల కోట్ల అక్రమాలు: మిర్చి యార్డులో డేటా ఎంట్రీ ఆపరేటర్లు మాన్యువల్‌గా హాజరు నమోదు చేసుకునే విధానం ఉంది. దీంతోవారు విధులకు ఎప్పుడొచ్చి వెళ్తున్నారో తెలియని పరిస్థితి. యార్డు లోపలికి వచ్చి ప్రతి వాహనం కచ్చితంగా తూకం వేయాల్సి ఉన్నా దాన్ని పక్కాగా అమలు చేయలేదు. కటింగ్, జీరో బిజినెస్, బిల్‌ టు బిల్‌ పేరుతో వ్యాపారులు మాయాజాలం చేయడంతో రైతులు నష్టపోయారని తేల్చారు. ప్రభుత్వానికి జీఎస్టీ ఆదాయం పోవడంలో అధికారుల నిర్లక్ష్యం ఉందని బాధ్యులైన వారిపైనా చర్యలు చేపట్టాలన్నారు. యార్డులో ప్రక్షాళన దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. మిర్చి యార్డులో వైఎస్సార్సీపీ నేతలు 2 వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని పూర్తిస్థాయి విచారణ జరిపి అవినీతి మొత్తం కక్కించాలని మిర్చి యార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు కోరారు.

విచారణ వేగవంతం - రేషన్ బియ్యం అక్రమార్కులకు ముచ్చెమటలు

నెల్లూరు జిల్లాను ముంచెత్తిన వర్షాలు - వరదలో ఇద్దరు యువకులు గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.