ETV Bharat / state

వైఎస్సార్సీపీ నేతల కబంధ హస్తాల్లో ప్రభుత్వ స్థలాలు- అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు - YSRCP Encroached Heavy Lands - YSRCP ENCROACHED HEAVY LANDS

YSRCP Leaders Encroached Heavy Lands & Illegal Constructions in Kadapa : వైఎస్సార్సీపీ నాయకుల భూ కబ్జాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా ప్రభుత్వ స్థలాల్నే చెరబట్టి అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేపట్టడం అక్రమాలకు పరాకాష్టగా నిలుస్తోంది. గత ఐదేళ్లు వైఎస్సార్సీపీ నాయకుల బరితెగింపును భరించిన అధికారులు ఇప్పుడు అయోమయంలో పడ్డారు.

ysrcp_leaders_encroached_heavy_lands_in-kadapa
ysrcp_leaders_encroached_heavy_lands_in-kadapa (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 22, 2024, 9:19 AM IST

YSRCP Leaders Encroached Heavy Lands in Kadapa : కడప నగరంలో వైఎస్సార్సీపీ నాయకుల భూ కబ్జాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నయి. ఏకంగా ప్రభుత్వ స్థలాల్నే చెరబట్టి అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేపట్టడం వారి అక్రమాలకు పరాకాష్టగా నిలుస్తోంది. గత ఐదేళ్లు వైఎస్సార్సీపీ నాయకుల బరితెగింపును కళ్లప్పగించి చూసిన అధికారులు, ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఏం చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.

YSRCP Leaders Occupied Government Lands : కడపలోని పోలీస్‌ పెట్రోల్‌ బంకు పక్కనున్న30 సెంట్ల స్థలాన్ని డిప్యూటీ మేయర్‌గా పని చేస్తున్న వ్యక్తి బినామీ పేర్లతో లీజుకు తీసుకుని నిర్మాణాలు చేపట్టారు. అన్బురాజన్ ఎస్పీగా ఉన్న సమయంలో 2023లో ఈ స్థలాన్ని లీజుకు తీసుకుని రెండతస్థుల నిర్మాణాలు చేపట్టారు. కింద నాలుగు గదులు నిర్మించి హోటళ్లు, వ్యాపారాలు నడిపిస్తున్నారు.! ఈ నిర్మాణాలకు కడప నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి అనుమతే తీసుకోలేదు.

కన్నేస్తే కబ్జానే! - కడపలో ప్రభుత్వ భూములు స్వాహా చేసిన వైఎస్సార్సీపీ నేతలు - YSRCP LEADERS OCCUPYING Govt LANDs

'దాదాపు 12 కోట్ల రూపాయల విలువైన ఈ స్థలం కబ్జాపై సీఎం చంద్రబాబుకు సర్వే నంబర్లతో సహా ఫిర్యాదులు వెళ్లాయి. పోలీసు కార్యాలయానికి చెందిన ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఇటీవల చెప్పారు. కానీ కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు డిప్యూటీ మేయర్‌తో కుమ్మక్కై భవనం కూల్చకుండా చెరిసగం పంచుకోవాలనే ప్రతిపాదన తెచ్చినట్లు కడపలో ప్రచారం సాగుతోంది.' -ఆంజనేయులు, గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి వేదిక కన్వీనర్

న్యాయం చేయాల్సిన అధికారులే కుమ్మక్కైతే ఎలా? - స్థలం కబ్జా చేశారంటూ పేద ముస్లిం ఆవేదన - Gold Shop Owner Occupied House Land

'కడప జిల్లా పరిషత్‌ స్థలాలనూ వైఎస్సార్సీపీ నాయకులు ఆక్రమించేశారు. జడ్పీ కార్యాలయం ఆవరణలోని కొంత ప్రాంతాన్ని బీరం శ్రీధర్ రెడ్డి కళాశాలకు కట్టబెట్టారు. దాని పక్కనే కార్మికుల సంక్షేమం కోసం ఇచ్చిన భవనం కింద వైఎస్సార్సీపీ కార్పొరేటర్ హోటల్ నిర్వహిస్తున్నారు. పాత కలెక్టరేట్ ఎదురుగా YS విగ్రహం వద్ద 25 సెంట్ల స్థలాన్ని డిప్యూటీ మేయర్ సోదరుడు కబ్జా చేసి కంచె వేశారనే ఆరోపణలున్నాయి. విశ్రాంత ఆర్మీ ఉద్యోగికి చెందిన ఐదెకరాల స్థలాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కుటుంబం కబ్జా చేసిందనే విమర్శలు ఉన్నాయి.' -చంద్ర, సీపీఐ కడప జిల్లా కార్యదర్శి

22.24 ఎకరాల చెరువు భూమి కబ్జా - గ్రామస్థుల ఆందోళన - Illegal Registration of Pond Land

వైఎస్సార్సీపీ నాయకుల భూ కబ్జాలకు కడపలో 2నెలల క్రితం వరకూ పనిచేసిన తాహసీల్దార్ శివరామిరెడ్డే సహకరించారని, వాటన్నింటికీ ఆయన్నే బాధ్యుల్ని చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.