ETV Bharat / state

దందాలు, దోపిడీల మధ్య నలిగిపోయిన సాగరనగరం - విశాఖను నంజుకుతిన్న వైసీపీ నేతలు - YSRCP Destroyed Visakhapatnam

YSRCP Leaders Destroyed Visakhapatnam: విశాఖ అంటే గుర్తొచ్చేది పర్యాటకం! ఒకప్పుడు పారిశ్రామిక ప్రగతి, పర్యాటకుల సందడి మధ్య సాగరనగరం వెలిగిపోయేది! కానీ, ఇప్పుడు వైఎస్సార్సీపీ దందాలు, దోపిడీ మధ్య నలిగిపోతోంది! భూములు కొల్లగొట్టి, సామాన్యుల్ని బెదరగొట్టి, పరిశ్రమలను తరిమికొట్టి, కొండలకు గుండుకొట్టి, ఐటీ ప్రగతికి గుండు సున్నా చుట్టి అయిదు సంవత్సరాలలో విశాఖను జగన్ మూక నంజుకుతింది.

YSRCP Leaders Destroyed Visakhapatnam
YSRCP Leaders Destroyed Visakhapatnam (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 9, 2024, 12:12 PM IST

YSRCP Leaders Destroyed Visakhapatnam: విశాఖలో వైఎస్సార్సీపీ పాలనలో సాగింది ముందెన్నడూ చూడని కొత్తరకం దోపిడీ. విలువైన భూములపై కన్నేసి, నయానో భయానో కొల్లగొట్టడం, ఒప్పుకోకపోతే వివాదాలు సృష్టించి, భూ యజమానుల్ని బెదిరించడం. అప్పటికీ లొంగకపోతే అధికారుల్ని ఉసిగొల్పి కేసులు పెట్టించడం, సెటిల్మెంట్‌కని పిలిచి ఎంతో కొంత ఇచ్చి రాయించుకోవడం. ఒక శాతం వాటాతోనే వ్యాపారమని సరిపెట్టుకునేలా చేసిన ఘనత విశాఖలో వైఎస్సార్సీపీ పెద్దలకే చెల్లింది. విశాఖలో భూదందా సాగింది, కార్యనిర్వాహక రాజధాని ముసుగులో జగజ్జంత్రీలు విశాఖను నంజుకుతిన్నారు. వేల కోట్ల విలువైన భూముల్ని వశపరుచుకున్నారు. వెలుగులోకి రాకుండా ఉన్న బినామీ వ్యవహారాలు ఎన్ని అన్నదానిపై లెక్క లేదన్నది పరిశీలించిన ఎవరికైనా ఆశ్చర్యం కలిగించకమానదు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విశాఖ పరిసరాలపై పూర్తి స్దాయిలో అధికారపార్టీ పెద్దలు తమ ప్రతాపం చూపడం ప్రారంభించారు. విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామంటూ అప్పట్లో వైఎస్సార్సీపీలో నంబర్‌-2గా ఉన్న నేత తిష్ట వేసి చేయని అరాచకం లేదు. భూవివాదాలు వస్తే ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడేవారు. కొన్ని భూములపై వాళ్ల మనుషులతోనే కోర్టుల్లో కేసులు వేయించి, న్యాయవివాదాలు సృష్టించారు. అడిగినంత వాటా ఇవ్వాలని, బేరాలు పెట్టి విలువైన భూములను దక్కించేసుకున్న వైనం ఇక్కడ జరిగింది.

భూములను మింగేసే కొత్త వైరస్!- Bro ఈ Tro ఏమిటి? - Land virus in AP

అంతా నంబర్‌ 2 కనుసన్నల్లోనే: వైఎస్సార్సీపీలో నంబర్‌2-గా పెత్తనం చెలాయించిన నేత మూడేళ్లకుపైనే విశాఖలో సమాంతర ప్రభుత్వ సారథిగా వ్యవహరించారు. ఆయన బంధువులు, బినామీలు అక్కడ భారీగా ఆస్తులు కూడగట్టారు. ఆయన కుమార్తె, అల్లుడికి చెందిన అవ్యాన్‌ రియల్టర్స్‌ సంస్థ కొన్ని వందల ఎకరాల భూములు కొనుగోలు చేసినట్టు ఆరోపణలు కోకొల్లలు. భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ రహదారిని ఆనుకుని అవ్యాన్‌ రియల్టర్స్‌ సంస్థ భూములు పోగేసిన వైనం వైఎస్సార్సీపీ అగ్రనేత చాతుర్యం ఇదా అని ముక్కన వేలేసుకునేలా చేస్తుంది. 2021 ఫిబ్రవరిలో మొదలు పెట్టి, 11 నెలల వ్యవధిలో కొనుగోళ్లను చక్కబెట్టారు. అప్పట్లో ప్రభుత్వ రికార్డుల ప్రకారమే ఆ భూముల విలువ 53 కోట్లు. బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ ఎన్నో రెట్లు అదనం. భోగాపురం బీచ్‌కారిడార్‌ రోడ్డు, నేరెళ్ల వలస దగ్గర వంపు తిరిగిన ప్రాంతం వద్దనే ఈ భూములు ఉన్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాకే ఆ రోడ్డు మార్గాన్నే మార్చేసి తమ వారి భూముల విలువ మరింత పెరిగేలా చూసుకున్నారు.

విశాఖలో విలువైన దసపల్లా భూముల కథలో హీరోలు వైఎస్సార్సీపీ బంధుగణమే! దసపల్లా భూములు అష్యూర్‌ డెవలపర్స్‌ వశమయ్యాయి. ఆ సంస్థ భాగస్వామి కూడా వైఎస్సార్సీపీలో నెం-2 నేతకు అత్యంత సన్నిహితుడైన వస్త్రవ్యాపారి గోపీనాథరెడ్డి. దసపల్లా భూముల రిజిస్ట్రేషన్‌కు అవసరమైన నిధులు అవ్యాన్‌ రియల్టర్స్‌ నుంచే అష్యూర్‌ సంస్థకు వెళ్లాయన్న ఆరోపణలున్నాయి. మధురవాడలోని శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌ పేరుతో చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులో 126వ నెంబరు విల్లా స్థలాన్ని అవ్యాన్‌ సంస్థకు రిజిస్ట్రేషన్‌ చేశారని, ప్రాజెక్టుకి అనుమతులు పొందేందుకు నెం.2 నేతకు కట్టాల్సిన కప్పం కట్టారన్నదీ బహిరంగ రహస్యమే.

అవినీతి బ్రదర్స్ - ఇసుక, మట్టి తవ్వకాలు, రవాణాలో వారిదే పెత్తనం ! - YSRCP Leaders Irregularities

కన్ను పడితే కొట్టేయాల్సిందే: రుషికొండలో రేడియంట్‌ అనే సంస్థకు 2005లో అప్పటి వైఎస్సార్‌ ప్రభుత్వం కేటాయించిన రూ.వెయ్యి కోట్ల విలువైన 50 ఎకరాల భూములు వైకాపా నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు సీఎం జగన్‌ సోదరుడు అనిల్‌రెడ్డి చేతిలోకి చేరినట్టు సమాచారం. అక్కడ విలాసవంతమైన విల్లాలు నిర్మిస్తున్నారు. డీల్‌కు ముందు రేడియెంట్‌ సంస్థ చెల్లించాల్సిన రూ.46 కోట్ల స్టాంప్‌ డ్యూటీ, రూ.6 కోట్ల ఖాళీ స్థలాల పన్ను మినహాయించారు.

ఇక దసపల్లా భూముల్లో 2 వేల కోట్ల రూపాయల విలువైన మరో 15 ఎకరాలు విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితుల చేతుల్లోకి వెళ్లాయి. ఆ భూముల్ని కాజేసేందుకు మధ్యలో ఉన్న రహదారిని అవసరం లేకపోయినా విస్తరింపజేశారు. టీడీటీ బాండ్ల పేరుతో మరో వెయ్యి కోట్ల రూపాయలకు టెండర్‌ పెట్టారు. గత ప్రభుత్వాలు కొన్ని దశాబ్దాలుగా నిషిద్ధ జాబితాలో ఉంచి కాపాడుతూ వచ్చిన భూముల్ని, జిల్లా కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వానికి లేఖ రాయించారు. అలా నిషిద్ధ జాబితా నుంచి తొలగింపజేశారు. అక్కడ విజయసాయి సన్నిహితులు భారీ గృహ, వాణిజ్య భవనాల నిర్మాణ ప్రాజెక్టుకు సిద్ధం చేసుకున్నారు.

అధినేత అండతో రెచ్చిపోయిన యువనేత - అభివృద్ధిలో నిల్‌ - అవినీతి ఫుల్‌ - YSRCP Leaders Irregularities

వందల కోట్ల రూపాయల విలువైన ఎన్​సీసీ భూములనూ: విశాఖలో 15 వందల కోట్ల రూపాయల విలువైన ఎన్​సీసీ భూములనూ వైఎస్సార్సీపీ పెద్దలు తన్నుకుపోయారు. మధురవాడలో ఏపీ హౌసింగ్‌ బోర్డుకి చెందిన 97 ఎకరాల భూమిని, ఎన్​సీసీ సంస్థ 2005లో బిడ్డింగ్‌లో దక్కించుకుని, 2013 వరకూ అక్కడ ఎలాంటి కార్యకలాపాలూ చేపట్టలేదు. ఒప్పందం రద్దు చేసి, భూములు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించగా, ఎన్​సీసీ సంస్థ కోర్టుకెళ్లి స్టేటస్‌కో తెచ్చుకుంది. 2014లో టీడీపీ ప్రభుత్వం కొన్ని షరతులతో ఆ భూమిని మళ్లీ ఎన్​సీసీకి అప్పగించింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పెద్దల కన్ను ఆ భూములపై పడి తెరవెనుక మంత్రాంగం నడిచింది. గత ఒప్పందంలో ఉన్న నిబంధన తొలగించేశారు.

ప్రాజెక్టులో ప్రభుత్వానికి ఎలాంటి వాటా లేకుండా, మొత్తం ప్రైవేటుపరం చేసేశారు. ఆ ప్రాజెక్టుని ఎన్​సీసీ సంస్థ నుంచి మంత్రి కొట్టు సత్యనారాయణ సోదరుడికి చెందిన జీఆర్​పీఎల్ సంస్థ దక్కించుకుంది. అక్కడ రిజిస్ట్రేషన్‌ విలువను చదరపు గజాల్లో లెక్కిస్తున్న ప్రభుత్వం, ఎన్​సీసీకి మాత్రం ఎకరాల్లో రిజిస్ట్రేషన్‌ ధరలు నిర్ణయించడంతో పాటు, బాగా తగ్గించేసింది. అలా ఎన్​సీసీకి చెందిన సుమారు 15 వందల కోట్ల విలువైన 97.30 ఎకరాల భూమి మంత్రి కొట్టు సోదరుడికి చెందిన జీఆర్​పీఎల్ దక్కించుకుంది. కాకపోతే ఇక్కడ తెరముందు కనిపించేంది జీఆర్​పీఎల్ సంస్థే అయినప్పటికీ తెరవెనుక మొత్తం నడిపిస్తోంది వైఎస్సార్సీపీ పెద్దలేనన్నది సుస్పష్టం.

విశాఖ జిల్లాలో 'అవినీతి ముత్యం' - కనుమరుగవుతున్న ఎర్రమట్టి దిబ్బలు! - YSRCP Leaders Irregularities

వృద్ధుల పేరుతో తీసుకున్న ప్రాజెక్టు సైతం: విశాఖలో వృద్ధుల పేరుతో తీసుకున్న ప్రాజెక్టు వైఎస్సార్సీపీ నేతలు వశం చేసుకున్నారు. వృద్దులు, అనాథలకు నిర్మించేందుకు విశాఖలోని ఎండాడలో 2008లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం చిలుకూరి జగదీశ్వరుడికి చెందిన హయగ్రీవ సంస్థకు 12.44 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించింది. అక్కడ కట్టే ఇళ్లు వృద్ధులకు మాత్రమే విక్రయించాలన్నది నిబంధన. ఆ భూమిలో జగదీశ్వరుడు ఎలాంటి కార్యకలాపాలూ చేపట్టలేదు. గత ప్రభుత్వాలు భూకేటాయింపుల రద్దుకు ప్రయత్నించగా, ఆయన కోర్టులకు వెళ్లి తనకు అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకునేవారు. అధికారంలోకొచ్చాక వైఎస్సార్సీపీ నాయకుల కన్ను హయగ్రీవ భూములపై పడింది. జగదీశ్వరుడు మొదట గద్దె బ్రహ్మాజీ అనే వ్యక్తికి హయగ్రీవ సంస్థలో 75 శాతం వాటా ఇస్తూ భాగస్వామిగా చేర్చుకున్నారు.

ఆ తర్వాత దాన్ని జగన్‌కు సన్నిహితంగా ఉన్న ఆడిటర్‌ గన్నమనేని వెంకటేశ్వరరావు-జీవీ పేరిట జీపీఏ చేశారు! వీఎంఆర్​డీఏ, జీవీఎంసీ నుంచి అనుమతుల్లేకుండానే ఆ భూమిని 30 మందికి వెయ్యి గజాలు చొప్పున అమ్మేశారు. ఆ భూముల్లో ఒక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేకి రెండు ప్లాట్లు, రాజ్యసభ సభ్యుడికి ఒక ప్లాటు కేటాయించినట్టు తెలుస్తోంది! వైఎస్సార్సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆడిటర్‌ జీవీ తన నుంచి ఆ భూమిని బలవంతంగా చేజిక్కించుకున్నారని జగదీశ్వరుడు 2021లో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఆ తర్వాత వారికి రాజీ కుదిరింది. హయగ్రీవ ప్రాజెక్టుకి కేటాయించిన భూములు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేసిన విశాఖ జిల్లా కలెక్టర్‌ మల్లికార్జునతోనే ఆ ప్రాజెక్టుకి అన్ని అనుమతులివ్వాలంటూ నిరభ్యంతర పత్రం జారీ చేయించారు. ఈ భూముల విలువ కూడా వెయ్యి కోట్లపైమాటే.

నదులపై వైఎస్సార్సీపీ ఇసుక తోడేళ్లు - అభివృద్ధి పనులకు కొరత - YSRCP Leaders Illegal Sand Mining

దందాలు, దోపిడీల మధ్య నలిగిపోయిన సాగరనగరం - విశాఖను నంజుకుతిన్న వైసీపీ నేతలు (ETV Bharat)

వెల్‌నెస్‌ సెంటర్‌ ప్రాజెక్టు కూడా : రుషికొండ వద్ద బేపార్క్‌ పేరుతో 5 నక్షత్రాల హోటల్‌ను తలదన్నేలా నిర్మించిన వెల్‌నెస్‌ సెంటర్‌ ప్రాజెక్టు కూడా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుల స్వాధీనంలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం దీన్ని జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హెటెరో సంస్థ నిర్వహిస్తోంది. బేపార్క్‌ పేరును పెమా వెల్‌నెస్‌ సెంటర్‌గా మార్చింది. ప్రముఖ సినీతారలు, పారిశ్రామిక, రాజకీయవేత్తలు, ధనవంతులు అక్కడ చికిత్సతోపాటు సేదతీరేందుకు వస్తుంటారు. ఆ ప్రాజెక్టు నిమిత్తం ఒక ప్రైవేటు వ్యక్తికి 2000 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం కొండపై 28 ఎకరాలు సముద్ర తీరాన్ని ఆనుకుని మరో 5.75 ఎకరాలు కలిపి మొత్తం 33.75 ఎకరాల్ని 33 ఏళ్లపాటు లీజుకిచ్చింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థకు ఏటా 10 లక్షల రూపాయలు లీజు చెల్లించాలన్నది ఒప్పందం. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక కీలక నేత కుమారుడు దక్కించుకున్నారు. ఇటీవల సర్దుబాటు కావడంతో ఆ ప్రాజెక్టు మల్లీ పాత యజమానుల చేతుల్లోకి వెళ్లింది. ప్రాజెక్టు లీజును 99 ఏళ్లకు పంచే యోచన కూడా చేసింది.

స్టూడియో కోసం కేటాయించిన భూములపై: విశాఖలో రామానాయుడు స్టూడియో కోసం కేటాయించిన భూములపైనా వైఎస్సార్సీపీ పెద్దల కన్నుపడింది. 2003లో అప్పటి ప్రభుత్వం విశాఖ-భీమిలి బీచ్‌ రోడ్డులో రామానాయుడు స్టూడియో నిర్మాణానికి కొండపై 34.44 ఎకరాలు కేటాయించింది. అందులో కొంత భాగంలో స్టూడియో నిర్మించగా, ఖాళీగా ఉన్న భూములపై వైఎస్సార్సీపీ నేతల కన్ను పడింది. ఆ భూముల్లోని 15.18 ఎకరాల్లో లేఅవుట్‌లు వేసి విక్రయించేందుకు, నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టేందుకు ఇటీవలే జీవీఎంసీ అనుమతులిచ్చేసింది. కొండపైన గృహ నిర్మాణ ప్రాజెక్టులకు అనుమతివ్వడం నిబంధనలకు విరుద్ధమైనా ఇచ్చేశారు. మొదట్లో మొత్తం స్టూడియో భూముల్ని కొట్టేసేందుకు ప్రభుత్వ పెద్దలు స్కెచ్చేశారు! చివరకు ఇప్పుడు వేస్తున్న లేఅవుట్‌లో సముద్రానికి అభిముఖంగా ఉండే కొన్ని బ్లాక్‌లను ‘ముఖ్యనేత’కు కట్టబెట్టేందుకు అంగీకారం కుదరడంతో లేఅవుట్‌కి అనుమతి ఇచ్చారనే ప్రచారం జరిగింది. లేఔట్‌ ప్రతిపాదిత 15.18 ఎకరాల విలువ 250 కోట్ల వరకూ ఉంటుంది.

అక్రమాలలో ఈ 'అన్న'కు పోటీ ఎవరూ లేరు - అనుచరులను అడ్డుపెట్టుకుని భారీగా దోపిడీ - YSRCP LEADER IRREGULARITIES

అధికారంలోకి వచ్చాక చేతులు మారింది: విశాఖలో రెండుదశాబ్దాల క్రితం చేపట్టిన కార్తీకవనం ప్రాజెక్టూ వైఎస్సార్సీపీ అధికారంలోకొచ్చాక చేతులు మారింది! కైలాసగిరి-రుషికొండ మధ్యనున్న ఎండాడలో కార్తీకవనం పర్యావరణ పర్యాటక ప్రాజెక్టు చేపడతామంటూ అప్పటి విశాఖ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ-వుడా అటవీశాఖ నుంచి 4.1 ఎకరాలు తీసుకుంది. వుడా నుంచి కొందరు ఆభూములు లీజుకి తీసుకుని తాత్కాలిక నిర్మాణాలతో హోటల్‌ వంటిది నడిపారు. 2014లో ఎమ్​ఏజీ లీజర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థ అక్కడ పర్యావరణ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామంటూ వుడా నుంచి వీఎంఆర్డీఏతో 20 ఏళ్లకు ఒప్పందం చేసుకుంది. సీఆర్​జెడ్ పరిధిలోకి వచ్చే ఆ భూమిలో అటవీ, పర్యావరణశాఖ నిబంధనల ప్రకారం సిమెంట్, కాంట్రీట్‌తో శాశ్వత నిర్మాణాలు చేయకూడదు. ఎమ్​ఏజీ లీజర్స్‌ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా అక్కడ విలాసవంతమైన హోటల్‌ నిర్మాణం చేపట్టింది. వైఎస్సార్సీపీ ఏలుబడిలోఅది, పోలవరం సహా కీలక ప్రాజెక్టులన్నీ దక్కించుకున్న మేఘా కృష్ణారెడ్డి చేతుల్లో ఉంది..! దీని విలువ 400కోట్ల రూపాయలని అంచనా.

సేవ ముసుగులోనూ కోట్లు విలువ చేసే భూముల్ని: సేవ ముసుగులోనూ కోట్లు విలువ చేసే భూముల్ని అయినవారికి అప్పజెప్పారు. రుషికొండలో 300 కోట్ల రూపాయల విలువైన భూమి వైఎస్సార్‌ సోదరి విమలారెడ్డి సందేశాలిచ్చే 'సెయింట్ లూక్స్‌' అనే మైనార్టీ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆధీనంలో ఉంది. వైఎస్‌ సీఎంగా ఉన్న సమయంలో 2009లో ఆ సంస్థకు 7.35 ఎకరాలు కేటాయించారు. ఎకరం కోటిన్నరకు ఇవ్వొచ్చని కలెక్టర్‌ సిఫారసు చేస్తే ఆ సంస్థకు 25 లక్షల రూపాయలకే ఎకరం భూమి చొప్పున కేటాయించారు. క్రైస్తవులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళల సాధికారతకు నర్సింగ్ శిక్షణ ఇస్తామని, ఆస్పత్రి నిర్మించి పేదలకు వైద్యం అందిస్తామంటూ ఆ సంస్థ భూములు తీసుకుంది. ఇంత వరకు అక్కడ ఎలాంటి ఆస్పత్రిని నిర్మించలేదు. ప్రార్థన మందిరాన్ని మాత్రం కట్టేశారు. విమలారెడ్డి అక్కడికి వస్తూ సందేశాలు ఇస్తుంటారు. ఆ భూమిలోని కొంత భాగంలో షెడ్డు వేసి నర్సింగ్ శిక్షణ ఇస్తున్నారు.

ఐదేళ్లలో రూ. వందల కోట్ల అక్రమార్జన - అవినీతి 'కాసు'లతో మల్టీప్లెక్స్‌ నిర్మాణం - YSRCP MLA Irregularities

లొసుగులు, వివాదాల్ని ఆసరాగా చేసుకుని: విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన ఎంవీవీ అండ్‌ ఎంకే హౌసింగ్‌ సంస్థ కూర్మన్నపాలెంలో 10.57 ఎకరాల విస్తీర్ణంలో భారీ నిర్మాణ ప్రాజెక్టు చేపట్టింది. ఐదు వేర్వేరు సర్వే నెంబర్లలో ఉన్న ఆ భూములకు సంబంధించి 11 మంది యజమానులతో 2018 జనవరి 8న ఎంవీవీ జనరల్‌ పవరాఫ్‌ అటార్నీతో కూడిన డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ రిజిస్టర్‌ చేసుకున్నారు. ఆ 11 మందీ ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల పిల్లలు. ఒప్పందం ప్రకారం ఆ స్థలంలో ఎంవీవీ 15 లక్షల చదరపుఅడుగుల నిర్మితప్రాంతం కల్గిన అపార్ట్‌మెంట్లు నిర్మించారు.

కానీ స్థల యజమానులు 11 మందికీ కామన్‌ ఏరియాతో కలిపి మొత్తం 14 వేల 400 చదరపు అడుగులు ఇచ్చేలా ఒప్పందం జరిగింది. అంటే 51 వేల 159 చదరపు గజాల స్థలంలో భూ యజమానికు వచ్చే అవిభాజ్య వాటా కేవలం 490 చదరపు గజాలే! డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ రిజిస్ట్రేషన్‌ పత్రాల్లోనే అక్కడ చదరపు గజం విలువ 18 వేలుగా పేర్కొన్నారు. ఎకరా 50 కోట్లు లెక్కేసినా అది కనీసం 500 కోట్ల రూపాయల విలువైన స్థలం. అంత భారీ ప్రాజెక్టులో భూ యజమానులకు ఇస్తోంది కేవలం 0.96 శాతమే! ఆ భూములపై యాజమాన్య హక్కుల్లో ఉన్న లొసుగులు, వివాదాల్ని ఆసరాగా చేసుకుని ఎంవీవీ వాటి యజమానులకు అతి తక్కువ వాటా ఇచ్చి మిగతా భూములు సొంతం చేసుకున్నారు.

కొండలకు 'కన్నా'లు వేసే 'బాబు' - వసూళ్లలో రా'రాజు' - కాదంటే గన్ను గురిపెట్టి - YSRCP LEADER IRREGULARITIES

బినామీ సంస్థ పేరుతో: విశాఖ నడిబొడ్డున సీబీసీఎస్​సీ చర్చికి చెందిన 500 కోట్ల విలువైన స్థలాన్నీ ఎంపీ ఎంవీవీ బినామీ సంస్థ పేరుతో కొట్టేశారనే ఆరోపణలున్నాయి. సిరిపురంలో సీబీసీఎస్​సీ చర్చికి సర్వే నెంబరు 75లో 19 వేల గజాల స్థలం ఉంది. దాని మార్కెట్‌ విలువ 500 కోట్లపైమాటే. 1993లో జరిగిన రిజిస్ట్రేషన్‌ ప్రకారం 18 సంస్థల యజమానులకు దానిలో వాటాలున్నాయి. దానిపై నేటికీ అనేక కేసులున్నాయి. ఆదిత్య డెవలపర్స్‌ అనే ఎంవీవీ బినామీ సంస్థ స్థల యజమానుల్ని బెదిరించి వారికి 30 శాతం, డెవలపర్‌కు 70 శాతం వాటా ఉండేలా ఒప్పందం చేసుకున్నట్టు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సాధారణంగా రహదారుల విస్తరణలో స్థలం పోతే వాటి యజమానులకు ప్రభుత్వం టీడీఆర్​ బాండ్లు ఇస్తుంది.

కానీ సీబీసీఎస్​సీ భూములకు సంబంధించి స్థలం పోకముందే భూ యజమానులతో దరఖాస్తు చేయించి 60 కోట్ల రూపాయల విలువైన టీడీఆర్​ బాండ్లను ఆగమేఘాల మీద జారీ చేశారు. ఇవి కాకుండా భూ వివాదాలకు సంబంధించి సెటిల్మెంట్ల వ్యవహారంలో ఎంపి కుటుంబాన్ని రౌడీషీటర్లు నిర్భందించడం ఇందులో మరో కొత్త మలుపు. విశాఖ నుంచి నేరుగా కడపకు విమానం నడపడం వల్ల మిగిలిన పెద్ద నగరాలకు లేని సదుపాయం ఇక్కడ సెటిల్మెంట్లకు నేరుగా బ్యాచ్ లు వచ్చేందుకు వీలన్నప్రచారం జరుగుతోంది. ఈ సెటిల్మెంట్ల వెనుక నేరుగా పెద్ద నేత హస్తమే ఉందన్న సమాచారం ఇక్కడ బాగా వ్యాప్తిలో ఉంది. జగన్ అధికారం కొల్పోయిన తర్వాత వచ్చే ప్రభుత్వం ఈ భూమాయలపైనే ప్రధానంగా దృష్టిపెట్టాల్సి ఉంటుంది.

సంబరాల సిత్రాలు - కమీషన్లతో కోట్లు ఆర్జన - ఓ వైపు తమ్ముడు, మరోవైపు అల్లుడు - YSRCP LEADER IRREGULARITIES

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.