ETV Bharat / state

వైఎస్సార్సీపీ నేత దాష్టికం- కాలిన గాయాలతో బయటపడిన ఒంటరి మహిళ! నామమాత్రపు సెక్షన్లతో కేసు - YSRCP Leader Attack on Women

YSRCP Leader lokanadham Attack on Women: విశాఖ జిల్లా గాజువాకలో ఒంటరి మహిళపై వైఎస్సార్సీపీ నాయకుడి హత్యాయత్నం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలు కాలిన గాయాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయకుండా నిందితులను రక్షించేందుకు యత్నిస్తున్నారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

YSRCP Leader lokanadham Attack on Women
YSRCP Leader lokanadham Attack on Women
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 13, 2024, 9:46 PM IST

Updated : Apr 13, 2024, 10:07 PM IST

YSRCP Leader lokanadham Attack on Women : విశాఖ జిల్లా గాజువాకలో ఒంటరి మహిళపై వైఎస్సార్సీపీ నాయకుడి హత్యాయత్నం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలు కాలిన గాయాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయకుండా నిందితులను రక్షించేందుకు యత్నిస్తున్నారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

కక్ష పెంచుకున్న అధికార పార్టీ నేత : విశాఖ పారిశ్రామిక ప్రాంతం గాజువాకలోని 65 వార్డులో నివాసం ఉంటున్న వివాహితపై వైఎస్సార్సీపీ నాయకుడి హత్యాయత్నం ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జలుమూరి రాధ అనే మహిళ ఇంటికి కుళాయి వేయిస్తానని 65వ వార్డు అధికార పార్టీ అధ్యక్షుడు లోకనాథం 20 వేల రూపాయలు తీసుకున్నాడని బాధితురాలి బంధువులు తెలిపారు.

నెలలు గడుస్తున్నా పని కాకపోవడంతో ఆమె నిలదీసిందని అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్థలానికి పట్టా ఇప్పిస్తా మరో 50 వేలు ఇవ్వాలని లోకనాథం అడిగినా రాధ ఇవ్వలేదని అన్నారు. కక్ష పెంచుకున్న లోకనాథం ఆ స్థలంలో ఉన్న రేకులు, ఐరన్ రాడ్లు తీసేశారని, దీనిపై బాధితురాలు న్యూ పోర్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీనిపై సీఐ చర్యలు తీసుకోకపోవడంతో ఫిబ్రవరి 26న సీపీ స్పందన కార్యక్రమంలో బాధితురాలు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆ ఫిర్యాదు మళ్లీ న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐ వద్దకే వచ్చిందని అన్నారు.

'పల్నాడులో ఇఫ్తార్‌ విందుకు టీడీపీ నేతలను పిలుస్తావా' అంటూ వైసీపీ కార్యకర్తలు కర్రలతో దాడి - YCP Leader Attack

కేజీహెచ్‌లో బాధితురాలు : ఇదే సమయంలో ఈ నెల 11న లోకనాథం కుటుంబసభ్యులు రాధ ఇంటికి పొరుగున వున్న అరుణ అనే మహిళ స్ధలంలోకి వచ్చి కబ్జాకు యత్నంచారు. సదరు స్ధలంలో ఉన్న కంపకు పెట్రోలు పోసి నిప్పుపెట్టి ఖాళీ చేయించేందుకు యత్నించగా ఆ మహిళకు రాధ అండగా నిలబడింది. దీంతో రాధను లోకనాథం మంటోల్లోకి తోసేశాడు. ఈ అమానవీయ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ముఖం కాలి చర్మం ఊడిపోయింది. ఎడమచేతికి ఫ్రాక్చరైంది. స్థానికులు ఆమెను కేజీహెచ్‌కు తరలించారు.

నామమాత్రపు సెక్షన్లు : బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులు నిందితులపై హత్యాయత్నం కేసు పెట్టకుండా నామమాత్రపు సెక్షన్లు పెట్టారని రాధ బంధువులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకుడికి అండగా నిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీది రౌడీయిజం - ఓటమి భయంతోనే హింసా రాజకీయాలు : చంద్రబాబు - Chandrababu Condemn Attack on tdp

టీడీపీ నేతల పరామర్శ : కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలు రాధను తెలుగుదేశం నేతలు పరామర్శించి ధైర్యం చెప్పారు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

లోకేశ్ డిమాండ్‌ : విశాఖ‌లో వైసీపీ అఘాయిత్యాల‌కు అడ్డూఅదుపూ లేకుండాపోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. జీవీఎంసీ 65వ వార్డు నివాసి జ‌లుమూరి రాధ‌పై లోక‌నాథంత‌గ‌ల‌బెట్టే ప్రయ‌త్నం చేయ‌డం చాలా దారుణమని ఆయన అన్నారు. జ‌గ‌న్ రెడ్డి పాల‌న‌లో సొంత త‌ల్లి, చెల్లికే ర‌క్షణ‌లేదన్న లోకేశ్, రాధ‌లాంటి సామాన్య మ‌హిళ‌ల‌కు ఇంకెక్కడిది ర‌క్షణ‌ అని నిలదీశారు. కాలిన గాయాల‌తో ఉన్న బాధితురాలికి మెరుగైన చికిత్స అందించి, ప్రాణాలు కాపాడాలని లోకేశ్ డిమాండ్‌ చేశారు.

జగన్​ సభకు రాను - టీడీపీ సానుభూతిపరుడిపై వైసీపీ నేతల దాడి - YCP Leaders Attacks

ఒంటరి మహిళపై వైఎస్సార్సీపీ నేత హత్యాయత్నం - నామమాత్రపు సెక్షన్లు పెట్టారని ఆరోపణ

Last Updated : Apr 13, 2024, 10:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.