YSRCP Govt Scam in SC and ST Schemes: సభ ఏదైనా సీఎం జగన్ నా ఎస్సీ, నా ఎస్టీ అనే డైలాగ్ కొట్టకుండా ఉండరు. ఈ తియ్యటి మాటల వెనకున్న ద్రోహం విలువెంతో తెలుసా? దాదాపు 29 వేల కోట్లు. ఇది జగన్ మార్క్ మోసం నవరత్నాలు ఇస్తున్నారు కాని అవి కేవలం ఎస్సీ, ఎస్టీలకే కాదు ఓసీలు, బీసీ వర్గాలకు కూడా ఇస్తున్నారు. ఇలా అందరికీ కలిపి ఇస్తున్నప్పుడు మరి దళితులకు ప్రత్యేకంగా జగన్ చేసింది ఏదీ లేదు. నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ మైకుల ముందు ప్రేమ ఒలకబోస్తూనే ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికకు పాతరేశారు. ఎస్సీ, ఎస్టీల కోసం గత ప్రభుత్వాలు అమలుచేసిన ప్రత్యేక పథకాలను తీశేసారు.
'ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో జగన్‌రెడ్డి వర్గం పెత్తనం - జనాన్ని భయపెడుతున్న ఆ ఇద్దరు'
Protest to Sanction SC and ST Loans: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ ఎస్సీ ఎస్టీలను నిలువునా దాగా చేశాడు. ఎస్సీ ఎస్టీలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని చెప్పే ముఖ్యమంత్రి వారిని అభివృద్ధి చెందకుండా వారిని మధ్యలోనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ రుణాల ద్వారా వివిధ రకాల వాహనాలు కొనుగోలు చేసిన వారికి గత రెండేళ్ల నుంచి సబ్సిడీ రుణాలు మంజూరు చేయకపోవడంతో గత్యంతరం లేక బాధితులందరూ కడప అంబేద్కర్ కూడలి వద్ద నిరసన వ్యక్తం చేశారు. చేతిలో ప్రకార్డులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
జగనన్న మార్క్ మోసం- నా ఎస్సీ, నా ఎస్టీ అంటూనే సంక్షేమాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తూట్లు
ఎస్సీ ఎస్టీలు తమ కాళ్లపై తాము నిలబడాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి సబ్సిడీల ద్వారా వివిధ రకాల వాహనాలను మంజూరు చేశారు. సబ్సిడీలు సకాలంలో వస్తాయని ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీలు బస్సులు, జీపులు, అంబులెన్స్ ఇలా వివిధ రకాల వాహనాలను కొనుగోలు చేశారు. కానీ వారికి ఇవ్వాల్సిన సబ్సిడీలను సకాలంలో ఇవ్వకపోవడంతో బ్యాంకు మేనేజర్లు రుణాలను చెల్లించాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని బాధితులు వాపోయారు. రుణాలను చెల్లించకుంటే వాహనాలను జప్తు చేస్తామని బ్యాంకు మేనేజర్లు ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. జగన్మోహన్ రెడ్డి ఇలాగే ఎస్సీ ఎస్టీలు ఏ విధంగా అభివృద్ధి చెందుతారని ప్రశ్నించారు. తక్షణ జగనన్న బడుగు వికాస రుణాలను మంజూరు చేయాలని లేదంటే ఎస్సీ ఎస్టీలకు ఆత్మహత్యలు తప్పవని తెలిపారు.
పెత్తందార్లకే పెత్తనం అప్పగిస్తున్న జగన్ - అగ్రవర్ణాల కిందే ఎస్సీ నియోజకవర్గాలు
ఆరు నెలలకు ఒక సారి సబ్సిడీ ఇస్తానని సీఎం జగన్ గతంతో చెప్పారు. ఆ నమ్మకంతోనే అప్పుడు ఎస్సీ, ఎస్టీలు ఓటు వేశారు. కాని వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలను మోసం చేశారు. అందరికీ బటన్ నొక్కి ఆదుకునే మీరు ఎస్సీ, ఎస్టీలను ఎందుకు ఆదుకోవడం లేదు మా బాధ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు.- రాజా, బాధితుడు