YSRCP Govt Increased land Market Value: ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలపై భారం వేయకుండా ఆదాయం పెంచడానికి ప్రాధాన్యం ఇస్తుంది. కానీ వైఎస్సార్సీపీ సర్కార్ రూటే సెపరేటు కదా. మూడు రాజధానుల పేరుతో మాటలు తప్ప చేతలు చేతకాక, పట్టాలెక్కిన ప్రగతిని పాతాళంలోకి తొక్కేసింది. దీంతో ఆదాయం లేక అప్పులవేట సాగిస్తోంది.
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి రాబడి కోసం రిజిస్ట్రేషన్ శాఖనే నమ్ముకుంది. నిర్దిష్టమైన విధానం లేకుండా మార్కెట్ విలువలను ఖరారు చేసింది. ఇష్టారీతిన ఫీజులను పెంచేసి, ఆస్తుల క్రయ, విక్రయదారులపై మోయలేని భారాన్ని మోపింది. సీఎం జగన్ మెప్పు కోసం కీలక అధికారులు ఫీజుల పెంపును ఓ యజ్ఞంలా కొనసాగించారు.
2018 సంవత్సరంలో 20 లక్షల ఆస్తి కొనుగోలు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం లక్షా 30వేలకు చలానా తీస్తే, ఇప్పుడు 2 లక్షలకుపైగానే ఖర్చవుతోంది. 2019-20లో 4వేల 886.65 కోట్ల రూపాయల వరకు రిజిస్ట్రేషన్ల రాబడి వస్తే, 2020-21లో 5వేల 382.77కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. 2021-22లో 7వేల 374.22 కోట్ల రూపాయలు, 2022-23లో 8వేల 079.00కోట్ల రూపాయల్ని రాబడిని వసూలు చేసింది.
మానసిక సమస్యలు లేని సమాజమే ధ్యేయం - గుంటూరులో పేదల డాక్టర్
2023-24 వచ్చేసరికి ఈ లక్ష్యాన్ని ఏకంగా 12వేల కోట్ల రూపాయలకు పెంచేసింది. వరుస ఫీజుల పెంపులకు అదనంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమ వసూళ్లతో కొనుగోలుదారులు విలవిల్లాడిపోతున్నారు. ఈ అవినీతిని తగ్గించడంపై ప్రత్యేకంగా అధ్యయనం చేయించినా సర్కార్ చర్యలు మాత్రం తీసుకోలేదు.
రాష్ట్రంలో తొలుత 2020లో మార్కెట్ విలువలను సవరించారు. కొవిడ్ కారణంగా 2021లో మార్పు చేయలేదు. వీటిని సవరించాలనుకుంటే, ఆగస్టు ఒకటో తేదీ నుంచి కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి తేవాలి. ఈ సంప్రదాయానికి స్వస్తి పలికిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం అవకాశం చిక్కినప్పుడల్లా భారం మోపుతూనే ఉంది.
2022లో కొత్త జిల్లాల ఏర్పాటును అదునుగా తీసుకుని, స్థిరాస్తి వ్యాపారుల ధోరణికి తగ్గట్లు మార్కెట్ విలువలను పెంచింది. 2022 ఫిబ్రవరి ఒకటిన కొత్త జిల్లాల విభజన హడావుడిని ప్రామాణికంగా తీసుకుని గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లా కేంద్రాల్లోనే మార్కెట్ విలువ సవరించింది. ఆ తర్వాత కొత్త జిల్లాలు ఏర్పడే ముందు మరోసారి 2022 ఏప్రిల్‌లో 11 కొత్త జిల్లా కేంద్రాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో మార్కెట్ విలువలను భారీగా పెంచింది. కొత్త జిల్లా కేంద్రాల్లో అక్కడి డిమాండును బట్టి మార్కెట్ విలువల్లో 13శాతం నుంచి 75శాతం వరకు పెంచి పేద, మధ్యతరగతి వర్గాల వారి నడ్డి విరిచింది.
తీర ప్రాంతాల్లో స్వచ్ఛతపై యానిమల్ వారియర్స్ కృషి
2023 జూన్ 1 నుంచి మళ్లీ ఎంపిక చేసిన గ్రామాల్లో సగటున 20శాతం వరకు మార్కెట్ విలువలను సవరించింది. ఎన్నడూ లేనివిధంగా వాణిజ్య సముదాయాల పేరుతో కొత్త కేటగిరి సృష్టించి మరీ ఫీజులను పెంచింది. సినిమాహాళ్లు, మిల్లులు, కర్మాగారాలు, కోళ్లఫారాల భవన నిర్మాణాలపైనా వడ్డించింది. తాటాకు, కొబ్బరాకులు, గుడిసెలపైనా చదరపు అడుగుకు అదనంగా 10 చొప్పున బాదేసింది. పల్లె, పట్టణమనే తేడా లేకుండా, ప్రస్తుత విలువలపై సగటున 5% చొప్పున ప్రభుత్వం పెంచింది.
కిందటేడాది ఏప్రిల్ నుంచి పది రకాల యూజర్ ఛార్జీలను జగన్ సర్కార్ అడ్డగోలుగా పెంచింది. ఈసీ జారీ చేసేందుకు గతంలో 10రూపాయలు ఉంటే 100 రూపాయలు చేసింది. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌కు 10 షీట్‌ల వరకు కేటగిరీని బట్టి 100, 200రూపాయలు వసూలు చేసేవారు. దీనిని 500కి పెంచేసింది. సేల్ - కం - జీపీఏ రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన స్టాంప్ డ్యూటీ వసూళ్ల విధానంలోనూ మార్పులు చేసింది.
సీఎం జగన్ చి(చె)త్త'శుద్ధి'లోపం - రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మురుగునీటి పారుదల వ్యవస్థ
గతంలో భూయజమాని నుంచి పవర్ ఆఫ్ అటార్నీ పొందేందుకు ఐదు శాతం స్టాంప్ డ్యూటీ చెల్లించేవారు. భూమిని పవర్ ఆఫ్ అటార్నీ పొందిన వ్యక్తే కొనుగోలు చేస్తున్నా, లేదా వేరేవారికి విక్రయించినా ఐదు శాతం స్టాంప్ డ్యూటీలో 4 శాతం మినహాయింపునిచ్చేవారు. ఇప్పుడు పవర్ ఆఫ్ అటార్నీ పొందిన వ్యక్తి ఆ భూమిని కొంటేనే 4 శాతం మినహాయింపు అమలు చేస్తున్నారు.
డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్‌కి మార్కెట్ విలువలో ఒక శాతాన్ని స్టాంప్ డ్యూటీగా చెల్లించే విధానాన్నీసవరించి మరీ క్రయ, విక్రయదారులపై భారాన్నిపెంచింది ప్రభుత్వం. డెవలప్‌మెంట్‌కి ఇచ్చిన స్థలం యజమానులు ఒకరి కంటే ఎక్కువ మంది ఉండి, తమ వాటాకి వచ్చే ఫ్లాట్లను వారు వేర్వేరుగా పంచుకుంటామని ఒప్పందంలో పేర్కొంటే ఒప్పంద విలువపై తలో 4% చొప్పున కన్వేయన్స్ స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తోంది. ఈ ఆర్థిక భారాన్నీ ప్లాట్‌లు కొనుగోలుచేసే వారే భరిస్తున్నారు.
క్షీణించిన మరో ఇద్దరు అంగన్వాడీల ఆరోగ్యం - ఆసుపత్రికి తరలింపు
ఉమ్మడి వారసత్వ ఆస్తి పంపిణీలో కొన్ని కుటుంబాల్లో ఒకరికి ఎక్కువ ఆస్తి కేటాయింపు లేదా పంపిణీపై స్టాంపు డ్యూటీ మినహాయింపు ఉంది. మిగిలిన భాగాలకు ఒక శాతం చొప్పున స్టాంపు డ్యూటీ చెల్లించే విధానం అమల్లో ఉంది. ఐతే ఈ నిబంధనలను తిరగదోడి మరీ ప్రభుత్వం అదనపు వసూళ్లకు తెగబడింది. ఎవరికి ఎక్కువ వాటా ఇవ్వాలనుకుంటున్నారో మిగిలిన వాటా దారులు తమ వాటా నుంచి ఆ మేరకు బదిలీ చేయాలి. బదలాయించిన అదనపు ఆస్తి భాగంపై మూడు శాతం స్టాంపు డ్యూటీ చెల్లించే విధానాన్ని అమల్లోనికి తెచ్చింది.
గుంటూరు జిల్లాలోని కొరిటిపాడు, పెదకాకాని, నల్లపాడు, గుంటూరు ఆర్వో సబ్ రిజిస్ట్రార్ల పరిధిలో పలుచోట్ల బహిరంగ మార్కెట్ ధరకు మించి రిజిస్ట్రేషన్ ధరలు ఉన్నాయి. వీటిని తగ్గించాలని స్పందన ద్వారా ప్రజలు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. గుంటూరు గ్రామీణ మండలం వెంగళాయపాలెంలో బహిరంగ మార్కెట్లో గజం ధర 7వేలు ఉండగా, ప్రభుత్వ ధర 7వేల 435 వరకు ఉంది. ఇటువంటి పరిస్థితులే విజయవాడ, ఇతర నగరాలు, పట్టణాల్లోనూ నెలకొన్నాయి.
టిడ్కో గృహాల నిర్మాణాలపై జగన్ హడావిడి - ఎన్నికలు సమీపిస్తుండడంతో హంగామా