ETV Bharat / state

శ్రీశైలం ప్రాజెక్టుకు జగన్​ శాపం - రూ.204 కోట్ల పనులకు గ్రహణం - YSRCP neglect on Srisailam Project - YSRCP NEGLECT ON SRISAILAM PROJECT

YSRCP Govt Negligence on Srisailam Project : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జలాశయాల నిర్వహణ గాలికి వదిలేశారు. డ్యాంల నిర్వహణలో అడుగడుగునా నిర్లక్ష్యం వహించారు. ఏటా ప్రాజెక్ట్​ల నిర్వహణకు నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేశారు. ఐదేళ్ల పాలనలో 10 లక్షలు రూపాయలు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుంది. ఈ నేపథ్యంలో డ్యాం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

sri_sailam_project
sri_sailam_project (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 1, 2024, 9:21 AM IST

YSRCP Govt Negligence on Srisailam Project : వైఎస్సార్సీపీ నిర్లక్ష్యం శ్రీశైలం ప్రాజెక్టుకు శాపమైంది. ప్రాజెక్టు నిర్వహణకు ప్రతిపాదించిన 204 కోట్ల రూపాయలు విలువైన పనులపై దృష్టి పెట్టకుండా నీరుగార్చింది. రూ.130 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే పనులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు 204 కోట్లు రూపాయలు వెచ్చించాల్సిన దుస్థితి నెలకొంది. ‘డ్రిప్‌’ పథకంలో (DRIP-Dam Rehabilitation And improvement Project) భాగంగా మొత్తం వ్యయంలో 30% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే మిగిలిన 70% కేంద్రం సమకూర్చే అవకాశమున్నా జగన్​ సర్కారు స్పందించలేదు.

ప్రస్తుతం నీటిని విడుదల చేయడంతో ప్రతిపాదిత పనులకూ అవకాశం లేకుండా పోయింది. స్పిల్‌వే నుంచి వేగంగా దూసుకొచ్చే నీటి ప్రవాహ ఉద్ధృతికి డ్యాం ముందు వంద మీటర్ల లోతున ప్లంజ్‌పూల్‌ (భారీ గొయ్యి) ఏర్పడింది. దానిని ఎలా పూడ్చాలన్న అంశంపై అధ్యయనమే మొదలు కాలేదు. డ్యాం గేట్ల ముందుండే ఏప్రాన్‌ (Apron) దెబ్బతినడంతో మరమ్మతులకు 74 కోట్ల రూపాయలు ఖర్చ అవుతుందని నిపుణులు అంచనా వేశారు. డ్యాం ఎదురు కుడివైపు భాగం పాడైందని, ఏప్రాన్‌ దగ్గరకు వెళ్లే మెట్లు, రోడ్ల మార్గాలూ దెబ్బ తిన్నాయని అధికారులు అధ్యయనంలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

నిండుకుండలా శ్రీశైలం జలాశయం - 10 గేట్లు ఎత్తి నీటి విడుదల - Srisailam Dam 10 Gates Lifted

ఇతర పనులూ పెండింగులోనే : వాటికి మరమ్మతులు, డ్యాం రక్షణకు అవసరమైన ఇతర పనులకు 87 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తేల్చారు. ప్రాజెక్టు పరిధిలో కొండవాలు ప్రాంతాలు కొన్ని అత్యంత ప్రమాదకరంగా మారాయని, రూ.9 కోట్లతో ‘షార్ట్‌ క్రీటింగ్‌’ (Short Cretting) పనులు చేయాలని పేర్కొన్నారు. సాంకేతిక వ్యవస్థల్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 3 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేశారు.

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం - 10 గేట్లు ఎత్తి నీటి విడుదల - Srisailam Dam Gates Lifted

వార్షిక నిర్వహణ పనులకు దిక్కేదీ? : శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ పనులకు సంవత్సరానికి రూ. 40 లక్షల నుంచి రూ.50 లక్షలు వెచ్చించాలి. వైఎస్సార్సీపీ సర్కారు వీటిని పట్టించుకోలేదు. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించి చేసిన పనులకు 4.80 కోట్లు రూపాయలు చెల్లించాల్సి ఉంది. అత్యవసరంగా మరో 4 కోట్ల రూపాయలు విలువైన పనులు చేపట్టాలి. వైఎస్సార్సీపీ తన ఐదేళ్ల పాలనలో 10 లక్షలు రూపాయలు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకొంది. ఈ నేపథ్యంలో డ్యాం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సీఎం చంద్రబాబు శ్రీశైలం ప్రాజెక్టును నేడు సందర్శించనున్న నేపథ్యంలో ఆయన కురిపించే వరాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.

నాగార్జునసాగర్​ దిశగా కృష్ణమ్మ పరుగులు - శ్రీశైలం ప్రాజెక్టు 3 క్రస్ట్ గేట్ల ఎత్తివేత - Srisailam Project Gates Lifted

కొనసాగుతున్న వరద : ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం వల్ల శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఈ క్రమంలోనే జలాశయం ఎనిమిది వరద గేట్లను పది అడుగుల మేర పైకెత్తి 2,23,768 క్యూసెక్కులను నాగార్జునసాగర్​కు విడుదల చేశారు.

అమరావతిలో ఐదేళ్లుగా నీళ్లలోనే భవనాల పునాదులు - పటిష్ఠత నిర్థారణకు ఐఐటీ బృందాల పర్యటన - Review on Amaravati Situation

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.