YSRCP Government Neglect on Rallapadu Rollapadu Water Scheme : నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెం, లింగసముద్రం మండలాల్లో తాగు నీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన రాళ్లపాడు-రోళ్లపాడు మంచినీటి పథకం సమస్యల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈ పథకంలో ప్రస్తుతం 115 గ్రామాలకు కలుషిత తాగు నీటినే అందిస్తున్నారు. కనీసం మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకులు కూడా శుభ్రం చేయని పరిస్థితి నెలకొంది.
వైఎస్సార్సీపీ పాలన - రోగాలు వ్యాప్తి : రాళ్లపాడు రిజర్వాయర్ని 20 ఏళ్ల కిందట టీడీపీ ప్రభుత్వంలో నూతన డైజైన్తో నిర్మించారు. వలేటివారిపాలెం, లింగసముద్రం మండలాలకు సంబంధించి 115 గ్రామాలకు తాగునీటిని అందించే పథకం. ఈ పథకం టీడీపీ ప్రభుత్వంలో మంచిగానే నిర్వహించారు. ఆ తరువాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత పైప్ లైన్లు దెబ్బతినడం, నీటిని నిల్వ చేసే రక్షిత పథకాలకు నిచ్చేనలు లేకపోవడంతో సమస్యలు వచ్చాయి. నిధులు కొరత వల్ల మరమ్మతులు చేయకపోవడంతో అనేక గ్రామాలకు కొళాయిల ద్వారా మంచి నీరు సరఫరా కావడం లేదు. రాళ్లపాడు రిజర్వాయర్ నుంచి పైప్‌లైన్ల ద్వారా గ్రామాలకు తాగునీరు అందించే ఈ పథకం గత ఐదేళ్లు నిర్వహణ లేక రోగాలను వ్యాప్తి చేస్తోంది.
తోటపల్లి జలాశయ కుడి ప్రధాన కాలువకు గండి- పంట నష్టంపై రైతుల ఆందోళన - Hole to Totapalli Canal
సరఫరా కానీ తాగు నీరు : 60 వేల మందికి పైగా తాగునీటి అవసరాలు తీర్చాల్సిన రాళ్లపాడు-రోళ్లపాడు మంచినీటి పథకం పైప్ లైన్లు చాలాచోట్ల దెబ్బతిన్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిధులు కేటాయించకపోవడం వల్ల అనేక గ్రామాలకు వెళ్లే పైప్ లైన్లు పగిలిపోయి తాగు నీరు సరఫరా కావడం లేదు. కొన్ని గ్రామాలకు నీళ్లు సరఫరా అవుతున్నా మురికిగా వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలుషిత నీటిని తాగి అనేక మంది అనారోగ్య బారిన పడుతున్నామని వాపోతున్నారు.
అసలే వర్షాకాలం, ఆపై రంగుమారిన తాగునీరు- విజయనగర వాసులను వణికిస్తోన్న వ్యాధుల భయం - polluted water
గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ఓవర్ హెడ్ ట్యాంకర్లు కూడా శుభ్రం చేయని దుస్థితి నెలకొందని, వీటి ద్వారా కుళాయిలకు నీరు సరఫరా అవుతోందని, ఇవి రంగు మారి దుర్వాసన వస్తున్నాయని స్థానిక ప్రజలు వాపోతున్నారు. వీటిని తాగి రోగాల బారిన పడుతున్నామని చెబుతున్నారు.
ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందిస్తాం : గత ప్రభుత్వంలో గ్రామీణ తాగునీటి వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు విమర్శించారు. అతి త్వరలోనే ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు.
జల్జీవన్ మిషన్ గ్రాంట్ వివరాలివ్వండి - అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశం - Pawan Kalyan Review