ETV Bharat / state

దళిత యువకుడి హత్య కేసులో మాజీ మంత్రి విశ్వరూప్‌ తనయుడు? - PINIPE SRIKANTH IN MURDER CASE

రెండేళ్ల క్రితం దళిత యువకుడు దుర్గాప్రసాద్ హత్య

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 21, 2024, 7:11 AM IST

Pinipe Srikanth in Murder Case : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రెండేళ్ల క్రితం జరిగిన దళిత యువకుడి హత్య కేసులో ప్రధాన నిందితుడు మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ అని తెలుస్తోంది. ఇన్నాళ్లూ ఎలాంటి విచారణ చేయని పోలీసులు తాజాగా మంత్రి వాసంశెట్టి సుభాష్ చొరవతో దర్యాప్తు చేపట్టారు. కేసులో మరో నిందితుడైన ధర్మేశ్‌ను ఇటీవలే అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించగా హత్యకు సూత్రధారిగా భావిస్తున్న మాజీ మంత్రి తనయుడు శ్రీకాంత్ పాటు మరో నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

అయినవిల్లి వాలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్ 2022 జూన్ 6న అదృశ్యమై కోటిపల్లి వద్ద గోదావరిలో శవమై తేలాడు. కోనసీమ అల్లర్ల సమయంలో ఈ ఘటన జరగింది. మొదట అదృశ్యం కేసుగా నమోదు చేసిన పోలీసులు పోస్ట్​మార్టం నివేదిక ఆధారంగా హత్య కేసుగా మార్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంత్రి అయిన విశ్వరూప్ ఆదేశాల మేరకు దర్యాప్తు పూర్తిగా నిలిపివేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

నెల రోజుల క్రితం దుర్గాప్రసాద్ భార్య శ్రావణసంధ్య మంత్రి వాసంశెట్టి సుభాష్​ను కలిసి తన భర్త ను చంపిన వాళ్లను శిక్షించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అప్పుడే ఈ వ్యవహారాన్ని డీజీపీ ద్వారకా తిరుమలరావు దృష్టికి మంత్రి తీసుకెళ్లారు. డీజీపీ ఆదేశాల మేరకు కొత్తపేట డీఎస్పీ గోవిందరావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఉప్పలగుప్తం మండలానికి చెందిన నిందితుడు, వైఎస్సార్సీపీ సోషల్‌ మీడియా కన్వీనర్, మృతుడికి స్నేహితుడైన వడ్డి ధర్మేశ్‌ను పోలీసులు విచారించారు.

ఈ కేసులో పాత్రధారుల, సూత్రధారులు, హత్య జరిగిన తీరుపై పూర్తి వివరాలు సేకరించినట్టు తెలిసింది.ఈ నెల 18న అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. నిందితుడు ధర్మేశ్, మృతుడు దుర్గాప్రసాద్ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్​కు సన్నిహితంగా ఉంటూ వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. దుర్గాప్రసాద్‌ను హత్య చేయించేందుకు నిర్ణయించిన శ్రీకాంత్‌ ధర్మేశ్‌ సహాయం కోరి, మరో నలుగురికి ఆ బాధ్యత అప్పగించినట్లు విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి విచారణాధికారిగా వ్యవహరిస్తున్న కొత్తపేట డీఎస్పీ గోవిందరావు పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.

హత్య జరిగిందిలా : దుర్గాప్రసాద్‌ హత్యకు ఓ లాడ్జిలో వ్యూహం పన్నినట్లు సమాచారం. దుర్గాప్రసాద్‌ను ధర్మేశ్‌ కోటిపల్లి రేవు వద్దకు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లగా, వెనుక కారులో నలుగురు అనుసరించారు. రేవు వద్ద ఓ వ్యక్తి పడవలో లోపలకు తీసుకెళ్లగా, కారులో వచ్చిన వారిలో ముగ్గురు దుర్గాప్రసాద్‌ మెడకు తాడు బిగించి, హత్య చేశారని నిందితుడు ధర్మేశ్‌ చెప్పినట్లు సమాచారం. దుర్గాప్రసాద్‌ను హత్య చేసిన నిందితుల్లో కొందరు ముమ్మిడివరం మండల పరిధిలో జరిగిన మరో హత్యలోనూ ప్రధాన నిందితులుగా ఉన్నట్లు తెలిసింది. తన భర్తను హతమార్చిన వారిని శిక్షించి తనకు న్యాయం చేయాలని గత నెల 30న కోనసీమ జిల్లా ఎస్పీకి శ్రావణ సంధ్య విన్నవించారు.

'వైఎస్సార్సీపీ పునాదులే నేరాలు - ఘోరాలు' - ఎక్స్​లో నారా లోకేశ్ V/S వైఎస్ జగన్

'పెత్తనం చెలాయించిన చోటే నిందితుడిగా' - చక్రం తిప్పిన స్టేషన్​ సెల్​లో బందీగా మారిన మాజీ ఎంపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.