ETV Bharat / state

ఐదేళ్లు మీరు గాడిదలు కాశారా ? ఛార్జిషీట్​లో వైఎస్ పేరు చేర్పించింది జగన్ కాదా?-విజయసాయి రెడ్డికి షర్మిలా కౌంటర్ - YS SHARMILA COMMENTS ON JAGAN

విజయసాయి కూడా జగన్ మోచేతి నీళ్లు తాగిన వాళ్లేనంటూ షర్మిల మండిపాటు - వైఎస్‌ఆర్‌ మరణానికి కాంగ్రెస్ ముమ్మాటికీ కారణం కాదన్న షర్మిల

YS_Sharmila
YS Sharmila (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 27, 2024, 4:11 PM IST

YS Sharmila Fires on Vijayasai Reddy: వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై, ఎంపీ విజయ సాయి రెడ్డిపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి చదివింది జగన్ మోహన్ రెడ్డి స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. ఆస్తుల గురించి నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాటా ఉంటుందన్న YSR మ్యాండేట్ అబద్ధం అని మీ బిడ్డల మీద ప్రమాణం చేయగలరా అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్​ వేదికగా మండిపడ్డాడరు.

"మీరు కూడా జగన్ మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగిన వాళ్లే. రాజకీయంగా,ఆర్థికంగా జగన్ వల్ల బలపడిన వాళ్లే. మీరు ఇలా కాకపోతే ఎలా మాట్లాడుతారులే. YSR మరణానికి కాంగ్రెస్ ముమ్మాటికీ కారణం కాదు. రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది YSR. బంగారు బాతును ఎవరూ చంపుకోరు. సొంత కళ్లను ఎవరూ పొడుచుకోరు. YSR మరణానికి చంద్రబాబు కారణం అయితే మీరు అధికారంలో ఉండి 5 ఏళ్లు గాడిదలు కాశారా?

మీ చేతకానితనానికి నిదర్శనం కాదా: ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదు? దర్యాప్తు చేసి నిజానిజాలు ఎందుకు బయట పెట్టలేదు? దోషులను ఎందుకు శిక్షించలేదు అనుమానం ఉండి, 5 ఏళ్లు అధికారంలో ఉండి, ఎందుకు ఒక్క ఎంక్వైరీ కూడా వెయ్యలేదు? ఇది మీ చేతకానితనానికి నిదర్శనం కాదా? YSR మరణం తర్వాత ఛార్జిషీట్​లో ఆయన పేరు చేర్పించింది మీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కాదా? కేసుల నుంచి బయట పడటానికి పొన్నవోలుతో కలిసి ఈ కుట్ర చేయలేదా?

మీలాంటి వాళ్లకు సంస్కారం ఉందని ఎలా అనుకోవాలి: చేయకపోతే జగన్ సీఎం అయిన వెంటనే, మొదటగా అడ్వకేట్ జనరల్ పదవి ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు మళ్లీ తన స్వప్రయోజనం కోసం తల్లిని కోర్టుకి ఈడ్చిన విషపు నాగు జగన్ కాదా? చంద్రబాబుతో నాకు ఎటువంటి వ్యక్తిగత సంబంధాలు లేవు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన బిడ్డ పెళ్లికి చంద్రబాబుని పిలిచారు. అలాగే నేను కూడా పిలిచాను. ప్రతిపక్ష నేతను పెళ్లికి ఆహ్వానిస్తే నా చీర గురించి కూడా విపరీత అర్థాలు తీసే మీలాంటి వాళ్లకు సభ్యతా సంస్కారం ఉందని ఎలా అనుకోవాలి?

జగన్​కి ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదా? ఇప్పటికీ అద్దంలో చూసుకున్నా చంద్రబాబే కనిపిస్తున్నట్లుంది. చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూడటానికో, ఆయన బ్రాండింగ్​ను ఫాలో అవ్వడానికో, ఆయన్ను ఇంప్రెస్ చేయడానికో పని చేయాల్సిన అవసరం YSR బిడ్డకు ఎన్నటికీ రాదని మాట ఇస్తున్నా" అని షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఇవి చూసేందుకే బతికి ఉన్నానా అని అమ్మ బాధపడుతోంది - కంటతడి పెట్టిన షర్మిల

వైఎస్సార్​ స్థాపించిన వ్యాపారాలు జగన్ సొంతం కాదు: షర్మిల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.