ETV Bharat / state

'ఎన్నికల్లో పోటీ చేసుకోండి - డబ్బులు ఇవ్వొద్దు, మద్యం తాగించొద్దు' - Flexi against Bribe in Elections - FLEXI AGAINST BRIBE IN ELECTIONS

Viral Flexi on Local Elections : 'స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే వారు, గ్రామంలో డబ్బులు ఇవ్వొద్దు, మద్యం తాగించొద్దు' అంటూ తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాలోని తండాల్లో ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే వారిని హెచ్చరిస్తూ వినూత్నంగా తండాల్లో ఆయాచోట్ల యువకులు ఇలా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

Viral Flexi on Local Elections
Viral Flexi on Local Elections (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 12, 2024, 1:25 PM IST

Youth Set up Flexi Against Bribe in Local Elections : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వారు డబ్బులు ఇవ్వొద్దు, మద్యం తాగించొద్దు అంటూ ఓ తండాలో వెలిసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం ఇది సోషల్​ మీడియాలో తెగ వైరల్​ అవుతోంది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బిచ్చానాయక్, రాజీవ్ నగర్ తండాల్లో చోటుచేసుకుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో (సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికల్లో) పోటీ చేసే అభ్యర్థులు గ్రామంలోని ఓటర్లకు డబ్బులు ఇవ్వొద్దు, మద్యం తాగించొద్దంటూ కొందరు యువకులు గ్రామ కమిటీ కుర్రాళ్ల పేరిట తండాలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో ఆయా తండాల్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

ఫ్లెక్సీలో ఏం రాసి ఉందంటే : అభ్యర్థులు స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తే చేయండని, కానీ ఓటర్లకు డబ్బులు ఇవ్వడం, వెంట తిప్పి తినిపించడం, మద్యం తాపించి తాగుబోతులుగా మార్చకండని హెచ్చరించారు. నిజాయతీగా రాజకీయాలు చేసుకోండని విజ్ఞప్తి చేశారు. అంతలా డబ్బులు ఖర్చు చేయాలనిపిస్తే గ్రామంలో ఏదైనా మంచిపని చేయాలని సూచించారు. కాదు, కూడదని ఊరిని ఆగం చేయాలని చూస్తే, ఏ మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. ఆధారాలు సేకరించి పోలీసులకు పట్టిస్తాం జాగ్రత్త అంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ఫ్లెక్సీ సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

'ప్రతి ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి, డబ్బులు పంచి ఓట్లు వేయించుకుంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్లు గెలవకపోతే మళ్లీ ప్రజల మీదకు దాడికి దిగుతున్నారు. ఈసారి ఇలా కాకుండా భవిష్యత్​ను దృష్టిలో ఉంచుకొని మంచివాళ్లను ఎన్నుకోవాలని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాం. ఈ హెచ్చరిక అభ్యర్థులకే కాకుండా ప్రజలకూ వర్తిస్తుంది.'- రమేశ్, తండా యువకుడు

ఓటర్లకు చైతన్యం కల్పిస్తున్న యువత : దీనిని చూసిన గ్రామస్థులు సైతం ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన యువతను అభినందిస్తున్నారు. ఈ విషయంపై తండాలోని యువత మాట్లాడుతూ, మార్పు అనేది ఇంటి వద్ద నుంచే మొదలు కావాలని అంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేవారు డబ్బులు, మద్యం పంచుతారని, ఓడిపోయిన వారు మళ్లీ అందరి ఇళ్ల వద్దకు వచ్చి నగదు తీసుకుని ఓట్లు వేయలేదని ఘర్షణ పడుతుంటారని చెబుతున్నారు. గెలిచిన వారు అవినీతి, అక్రమాలకు పాల్పడతారని ఆరోపిస్తున్నారు. ఆ విధంగా చోటు చేసుకోకుండా ఎన్నికల్లో పోటీ చేసేవారు ఓటర్లకు డబ్బులు ఇవ్వొద్దని, ఒకవేళ బలవంతంగా ఇచ్చినా ఓటర్లు తీసుకోవద్దని అందరికీ చైతన్యం కల్పిస్తున్నామని చెప్పారు.

మీకు తెలుసా? 'బిగ్‌బాస్‌లో పాల్గొనాలంటే ఆ పరీక్ష చేయించుకోవాలి' - High Court on Bigg Boss show

వరద బాధితులకు గుడ్ న్యూస్ - నష్టం వివరాల నమోదుకు గడువు పొడగింపు - Government Extended Enumeration

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.