ETV Bharat / state

'మంచినీళ్లు ఎంత తాగినా దాహం తీరడంలే సారూ - జర కేఎఫ్ బీర్లు తెప్పించండి' - Young Man Protest KF Beers - YOUNG MAN PROTEST KF BEERS

Young Man Padayatra for King Fisher Beers : ఎండాకాలం కదా, వేడి భరించలేక చల్లగా ఓ బీర్​ కొడదామని ఆ యువకుడు వైన్ షాపుకెళ్లాడు. అన్నా ఓ 'కేఎఫ్​ లైట్​ బీర్​ ఇవ్వు' అని అడిగాడు. ఆ బ్రాండ్​ లేదంటూ దుకాణదారుడు ఇచ్చిన మరో బ్రాండ్ బాటిల్​ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరునాడు మళ్లీ వచ్చాడు. ఈసారీ దొరకలేదు. అలా వారం, పది రోజుల పాటు నచ్చిన బ్రాండ్ కోసం అడుగుతూనే ఉన్నా, ఆన్సర్ మాత్రం మారలేదు. ఇక లాభం లేదనుకున్న ఆ యువకుడు, తన సమస్యకు ఒక్కటే పరిష్కారం అనుకున్నాడు. అసలు ఆ యువకుడు ఎవరు? తన ప్రాబ్లమ్​ను సాల్వ్​ చేసుకోవడానికి ఏం చేశాడో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.

Young Man Padayatra for King Fisher Beers

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 9:10 PM IST

Young Man Protest for King Fisher Lite Beers : తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 10 దాటిందంటే చాలు సూరీడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ వేడిమి నుంచి కాస్త ఉపశమనం కోసం జనాలు కూలర్లు, కూల్ వాటర్, కూల్​డ్రింక్​ల వంటి వాటిని ఆశ్రయిస్తున్నారు. అదే కాస్త మద్యం సేవించే అలవాటు ఉన్న వాళ్లైతే ఎంచక్కా బీర్లతో చిల్ అవుతున్నారు. ఏడాది మొత్తంలో జరిగే బీర్ల అమ్మకాల కంటే, ఈ 2 నెలల్లో జరిగే బీర్ల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే మామూలు సమయాల్లో బీర్ల కంటే మందు ఎక్కువగా పుచ్చుకునే మన మందుబాబులు, ఈ 2 నెలలు మాత్రం మందుకు కాస్త దూరంగా ఉంటూ బీర్లను తెగ తాగేస్తుంటారు.

మరీ ముఖ్యంగా యువత అయితే పార్టీలు, సాయంత్రం వేళ సిట్టింగ్​లు అంటూ కాటన్​లకు కాటన్​లు తాగేస్తుంటారు. మంచినీళ్లు తాగినట్లే బాటిళ్లకు బాటిళ్లు లేపేస్తుంటారు. బీర్లు అంటే వారికి అంత ప్రేమ మరి. అయితే అంతటి ఇష్టమైన బీర్ల కోసం బార్ల వద్ద బారులుతీరైనా, వైన్సుల వద్ద ముష్టి యుద్ధాలు చేసైనా సరే బాటిల్ దొరికే వరకు వెనక్కి తగ్గేదే లే అంటూ లైన్లలో వెయిట్ చేస్తుంటే, కొన్నిచోట్ల మాత్రం వారికి ఇష్టమైన బ్రాండ్​లు దొరక్క వారి వెయిటింగ్​కు వెయిటేజీ లేకుండా చేస్తున్నాయి. మద్యంప్రియులంతా ముక్తం కంఠంతో కోరుకునే 'కేఎఫ్​ బీర్లు' వారికి అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. కావాల్సిన బీరు దొరకట్లేదనే సగటు మందుబాబు బాధను ఎవరూ పట్టించుకోవడం లేదు. వైన్సుల్లో ఎన్నిసార్లు రిక్వెస్ట్​ చేసినా, కొన్నిసార్లు గొడవలకు దిగినా ప్రయోజనం మాత్రం ఉండటం లేదు. ఎన్ని వైన్సులు తిరిగినా, ఏ బార్​లో అడిగినా 'కేఎఫ్​ నో స్టాక్' అనే మాటే వినిపిస్తుంది.

అయ్యా కలెక్టర్​ సార్​.. మా ఊర్లో కింగ్​ఫిషర్ బీర్లు అమ్మడం లేదంటూ ఫిర్యాదు

ఇలాంటి మాటలు వినీవినీ విసిగిపోయిన ఓ యువకుడు, ఇక లాభం లేదనుకుని మందుబాబుల బాధలను తీర్చేందుకు కంకణం కట్టుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన బాధనంతా (మందుబాబుల బాధ) ఓ పేపర్​పై పెట్టాడు. ఆ పేపర్​ తీసుకుని రెండు చేతులు జేబులో పెట్టుకుని అలా నడుచుకుంటూ ఆబ్కారీ శాఖ సూపరింటెండెంట్​ వద్దకు వెళ్లాడు. 'సార్, నా పేరు తరుణ్. నేను మంచిర్యాల జిల్లా తాగుబోతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. గత కొన్ని రోజులుగా జిల్లావ్యాప్తంగా ఏ వైన్సులోనూ, బార్లలోనూ 'కేఎఫ్​ లైట్' బీర్లు దొరకడం లేదు. అసలే ఎండలు దంచికొడుతున్నాయి. దాహం తీర్చుకుందామంటే మాకు నచ్చిన బీర్లు లేక బాగా ఇబ్బందులు పడుతున్నాం. ఏవేవో కొత్త బ్రాండ్లు మాకు అలవాటు చేయిస్తున్నారు. గతిలేక మేం వాటిని తాగాల్సి వస్తోంది. ఇప్పటికైనా మా ప్రాబ్లమ్ అర్థం చేసుకుని, కేఎఫ్​ లైట్ బీర్లు అందుబాటులో ఉంచితే, రాష్ట్ర ఆదాయాన్ని మరింత పెంచేందుకు మేము మా శాయశక్తులా ప్రయత్నిస్తాం.' అని రాసి ఉన్న లేఖను ఆ అధికారికి అందజేశాడు. తాగుబోతులందరి తరఫున మనోడు చేసిన పోరాటం ఫలించి, వారికి కావాల్సిన కింగ్ ఫిషర్ బీర్లు దొరకాలని మనమూ కోరుకుందాం.

బీర్ల కోసం వైన్​ షాప్​ ముందు ధర్నా - సర్దిచెప్పేందుకు వచ్చిన పోలీసులపై! - Alcohol Drinkers Attack on Police

Beer sales increased: ఎండ సుర్రుమంటోంది.. బీరు పొంగిపారుతోంది..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.