Young Man Died of Electrocution : అటవీ మృగాల నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి యువకుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని సోమల మండలానికి చెందిన గణపతి (20) నాలుగు నెలల కిందట ప్రేమవివాహం చేసుకున్నారు. వారి జీవితం సుఖంగా సాగుతోంది. ఈ తరుణంతో గణపతి, మరి కొందరితో కలిసి గొర్రెలు మేపేందుకు సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. అందులో మూడు మూగజీవాలు రాత్రి ఇంటికి రాలేదు. వాటిని వెతికేందుకు మేనమామ సిద్దప్ప, మరొకరు ఈశ్వరయ్య రాత్రి అటవీ ప్రాంతానికి వెళ్లారు.
సమీపంలోని మామిడితోటలో ఉంటాయని భావించి వెళ్లేందుకు యత్నించగా జంతువుల రక్షణ కోసం ఏర్పాటు చేసి విద్యుత్ తీగలు కాలికి తగిలి విద్యుదాఘాతంతో గణపతి కుప్పకూలిపోయాడు. అతన్ని రక్షించేందుకు యత్నించిన సిద్ధప్పకు విద్యుదాఘాతంతో గాయాలు అయ్యాయి. ఈశ్వరయ్య గ్రామస్థుల సహాయంతో వారిద్దరిని పెద్దఉప్పరపల్లె పీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే గణపతి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వివాహం అయిన నాలుగు నెలల ప్రమాదంలో గణపతి మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. సీఐ కృష్ణారెడ్డి ఆదేశాలతో ఎస్సై వెంకటనరసింహులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఎస్సీ, ఎస్టీ ప్రజాసంఘాల నాయకులు ఆందోళన చేశారు.
ఫుట్‌పాత్‌పై పడి ఉన్న కరెంట్ తీగ తాకి తల్లీకూతుళ్లు మృతి- దీపావళికి వెళ్లి వస్తుండగా
Government Teacher Suicide : ఇంటి నుంచి బయలుదేరి విధులకు వెళ్లిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జలాశయంలో విగత జీవిగా కనిపించాడు. శ్రీ సత్య సాయి జిల్లా కదిరి మండలం కే బ్రాహ్మణపల్లి వద్ద ఉన్న చెర్లోపల్లి జలాశయంలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహం నల్లమాడ మండలం బాసం వారి పల్లి కి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మహేంద్ర రెడ్డిదిగా గుర్తించారు. మహేందర్ రెడ్డి ఆమడగూరు మండలం గుండువారిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.
గత నెల 30న పాఠశాలకు వెళుతున్నట్లు తల్లిదండ్రులకు చెప్పిన ఆయన సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. కంగారు పడిన కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీశారు. ఫోన్ చేసినా స్పందించక పోవడం, సన్నిహితులకు సమాచారం తెలియక పోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఆయన ఆచూకీ కోసం వివిధ ప్రాంతాలలో వెదికారు. కదిరి మండలం చెర్లోపల్లి జలాశయం వద్ద ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్ గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మద్యం మత్తులో బీరు సీసా పగులగొట్టి గాజు పెంకులు మింగేశాడు
మొబైల్ ఆధారంగా ద్విచక్ర వాహనం అక్కడ ఉన్న వస్తువులు ఉపాధ్యాయుడు మహేంద్ర రెడ్డివిగా భావించిన పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి నిర్ధారించుకున్నారు. ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలి మహేందర్ రెడ్డి ఎక్కడికెళ్లి ఉంటారన్న అనుమానంతో వివిధ ప్రాంతాల్లో గాలించారు. ఉపాధ్యాయుడి మృతదేహం జలాశయంలో తేలడంతో బంధువులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఊపిరాడకుండా ఉండేలా ముఖానికి ప్లాస్టిక్ కవర్లను కట్టుకొని రిజర్వాయర్‌లోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. అవివాహితుడైన మహేందర్ రెడ్డికి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితిపై పోలీసులు వివరాలు తెలుసుకుంటున్నారు.