ETV Bharat / state

రాష్ట్రంలో విచిత్ర ఎన్నికల నియమావళి - వైఎస్సార్సీపీకి వర్తించని కోడ్ నిబంధనలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 19, 2024, 10:35 PM IST

YCP Government Violated Election Code : దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియామవళి అమలులోకి వచ్చింది. కోడ్ పటిష్ఠంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సైతం ఆదేశించారు. కానీ రాష్ట్రంలో మాత్రం ఎన్నికల కోడ్ అమలులో అడుగడుగునా ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నికల సంఘం పదే పదే హెచ్చరికలు చేస్తున్నా వైఎస్సార్సీపీ మాత్రం వాటిని లెక్క చేయటం లేదు. బహిరంగ ప్రదేశాల్లో వైసీపీ జెండాలు, నేతల ఫ్లెక్సీలు అలాగే దర్శనమిస్తున్నాయి.

YCP_Government_Violated_Election_Code
YCP_Government_Violated_Election_Code

YCP Government Violated Election Code : రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా అడుగడుగునా ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా వైసీపీ జెండాలు, నేతల ఫ్లెక్సీలు అలాగే దర్శనమిస్తున్నాయి. వైయస్‌ఆర్‌ జిల్లా మైదుకూరులో వైసీపీ నాయకులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. కేవలం సభ నిర్వహణకు అనుమతి తీసుకున్న నాయకులు ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లకు వైసీపీ జెండాలతో ప్రదర్శనలో పాల్గొన్నారు. డీజే శబ్ధాలు చేస్తూ బాణసంచా కాల్చారు. ర్యాలీలో అడ్డదిడ్డంగా వాహనాలు నడపడంతో మైదుకూరు పట్టణంలో తీవ్ర ట్రాఫిక్‌ సమస్యకు దారి తీసింది. పట్టణంలో 167బి జాతీయ రహదారిపై దాదాపు గంటన్నర సేపు ట్రాఫిక్‌ స్తంభించింది.

రాష్ట్రంలో విచిత్ర ఎన్నికల నియమావళి - వైఎస్సార్సీపీకి వర్తించని కోడ్ నిబంధనలు

వైసీపీ ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగులు - ఇద్దరిపై ఈసీ వేటు

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలలో ఈసీ నిబంధనలు ఉల్లఘించి అధికార పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న 16 మంది వాలంటీర్లపై సస్పెన్షన్‌ వేటు పడింది. అంబాజీపేట మండలంలోని ముసలపల్లి, ఇరుసుమండ, వాకలగరువు గ్రామాల్లో వైసీపీ నిర్వహించిన సిద్ధం సభల్లో పాల్గొన్న 16 మంది వాలంటీర్లను సస్పెండ్ చేస్తూ ఇంఛార్జి MPDO లక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా గ్రామాల్లో వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన సిద్ధం గ్రామసభల్లో వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఈనాడులో 'వద్దంటే వినరే, వైసీపీ సైన్యం బరితెగింపు' అనే శీర్షికలతో కథనాలు ప్రచురించారు. కథనాలకు స్పందించిన అధికారులు వాలంటీర్లను సస్పెండ్ చేశారు.

Code Violation in Srikakulam District : శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని లొద్దపుట్టి కూడలి వద్ద ఉన్న ప్రజా సంకల్ప యాత్ర ముగింపు పైలాన్ వద్ద జగన్ ఫొటోలకు ఇప్పటికి ముసుగు పడలేదు. కోడ్ అమల్లోకి రావడంతో నిబంధనల ప్రకారం వీటిని కప్పి ఉంచాలి. కానీ ఇక్కడ అలాంటి చర్యలు చేపట్టకపోవడంతో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

ముదిరిన వైసీపీ ప్రచార పిచ్చి - కేంద్ర పథకాలకు పార్టీ రంగులు

వ్యవస్థలను స్వలాభానికి వాడుకోవడంలో జగన్‌ రెడ్డి సైన్యానికి మించిన వారు లేరు. ఎన్నికల కోడ్‌ వచ్చినా, బేఖాతర్‌ అంటూ పార్టీ రంగుల పిచ్చిని పరాకాష్టకు తీసుకెళ్తున్నారు. వైసీపీ చేష్టలకు అధికారులు సైతం వంతు పాడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలకు వైఎస్సార్సీపీ రంగు వేసి ప్రచారానికి వాడుకున్నారు. కోర్టులు చివాట్లు పెట్టినా పట్టించుకోలేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ వచ్చింది కాబట్టి నిబంధన ప్రకారం పార్టీ రంగులు, ఆయా పార్టీలకు చెందిన నాయకుల విగ్రహాలు, అధికార ప్రతినిధులు ఫొటోలు వంటివి ఉండకూడదు. కానీ ప్రకాశం జిల్లాలో రంగులు తొలగించకుండా అలాగే వదిలేశారు. అలాగే జిల్లాలోని పార్క్ చుట్టూ ఉన్న కంచెకు ఎన్నికల కోడ్ వచ్చినా వైసీపీ రంగులు వేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే జగన్ సర్కార్ ఎంతకు తెగించిందో అర్థమవుతుంది.

సీ-విజిల్ ద్వారా ఫిర్యాదు చేస్తే 15 నిమిషాల్లో చేరుకుంటాం - సమస్య పరిష్కరిస్తాం

Election Code Violation in AP : దేశంలో ఎక్కడా లేనట్టు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలు అవుతుందని మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్నికల నిబంధనలు ఏ మాత్రం అమలు కావడం లేదంటూ తీవ్ర విమర్శలు చేశారు. తాను రాజమహేంద్రవరం నుంచి తణుకు వెళ్తున్న సమయంలో చెక్ పోస్టు వద్ద తన కారును అధికారులు తనిఖీ చేశారన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం - చెత్తకుప్పలో జర్నలిస్టుల ఇంటి స్థలాల పత్రాలు

అయితే ఆ చెక్ పోస్టుకు 100 అడుగుల దూరంలో ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే భారీ కటౌట్ ఉందన్నారు. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి ఏ మాత్రం అమలౌతుందో ఇదే నిదర్శనమన్నారు. ఇది సిగ్గుపడాల్సిన విషయం అన్నారు. రేషన్ వాహనాలపై ముఖ్యమంత్రి చిత్రపటాలు ఎక్కడ కూడా తొలగించలేదని రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.

ధ్రువపత్రాలు మీద ముఖ్యమంత్రి పేరు ఈనాటికి కొనసాగడం శోచనీయమన్నారు. పిల్లల స్కూల్ బ్యాగ్ మీద ముఖ్యమంత్రి చిత్రపటాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారులు, జిల్లా అధికారులు ఇప్పటికైనా స్వతంత్రంగా వ్యవహరించాలన్నారు. ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతాయనే భావన ప్రజల్లో నింపాలని తెలిపారు. లేనియెడల మనం విఫలమైతే చరిత్రహీనులుగా మిగిలిపోతామన్నారు.

ఎన్నికల కోడ్ వచ్చినా డోట్ కేర్ - వైసీపీ ప్రచారకర్తలుగా వాలంటీర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.