Wife Caught Husband in Ongole : ఈ రోజుల్లో వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాల్లో చిచ్చురేపుతున్నాయి. ఆ మోజులో పడి ఎంతోమంది తమ పండంటి కాపురాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఓ వైపు ఆ మోజులో పడి కట్టుకున్న వాడిని కడుపున పుట్టిన వాళ్లను సైతం వదిలేసేందుకు సైతం సిద్ధపడుతున్నారు. మరోవైపు అడ్డొస్తే చంపడానికి సైతం వెనకాడటం లేదు. ఆ తర్వాత జరిగే పరిణామాలు తెలిసినా క్షణిక సుఖాల కోసం కుటుంబాలను వీధిపాలు చేస్తున్నారు. తద్వారా జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. తాజాగా ప్రియురాలితో సహజీవనం చేస్తూ ఓ భర్త భార్యకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు.
ఆయనో ఎంపీడీవో. విధి నిర్వహణలో భాగంగా వేరే ప్రాంతానికి వెళ్లారు. అక్కడ తనకు పరిచయమైన మహిళతో ప్రేమాయణం సాగిస్తున్నారు. కుటుంబాన్ని కాదని గత కొన్ని సంవత్సరాలుగా ఆమెతోనే ఉంటున్నారు. అనుమానించిన కుటుంబీకులు నిఘా పెట్టి అతన్ని పట్టుకున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. ఒంగోలు నగరం కర్నూలు రోడ్డు కూడలిలోని ఒక లాడ్జిలో ఆదివారం చోటుచేసుకుంది.
ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి నెల్లూరు జిల్లాలో ఎంపీడీవోగా పనిచేస్తున్న అధికారి ఒకరు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో బదిలీపై చిత్తూరు జిల్లా వెళ్లారు. అక్కడ ఆయనకు ఏఎన్‌ఎం ఒకరు పరిచయమయ్యారు. అప్పటి నుంచి ఆయన కుటుంబానికి దూరమయ్యారు. భార్యాపిల్లల్ని పట్టించుకోవడం మానేశారు. కనీసం ఇంటికి కూడా వెళ్లడం లేదు. ఈ పరిణామంతో కుటుంబీకులు అతని కదలికలపై నిఘా పెట్టారు.
Wife Caught Husband Extramarital Affair in Ongole : ఆదివారం నాడు మధ్యాహ్నం ఒంగోలులోని ఒక లాడ్జిలో ఉన్నట్లు గుర్తించి భార్య, కుమార్తె, కుమారుడు అక్కడకు చేరుకున్నారు. ఎంపీడీవో, ఆయన ప్రియురాలిని పట్టుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణ చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు లాడ్జి వద్దకు చేరుకుని ఎంపీడీవో, ఆయన ప్రియురాలిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎస్సై అనిత వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. కుటుంబ సభ్యులు కూర్చుని మాట్లాడుకోవాలనీ, వీధులకెక్కి పరువు తీసుకోవద్దని హితవు పలికారు. లేదంటే న్యాయస్థానాల్లో తేల్చుకోవాలి తప్ప ఘర్షణకు దిగవద్దని ఎస్సై అనిత హితవు చెప్పి పంపించారు.