ETV Bharat / state

వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురు దుర్మణం - Wanaparthy Accident Today

Wanaparthy Road Accident Today : వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు చెట్టును ఢీ కొట్టడంతో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడగా అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా కర్ణాటకలోని బళ్లారి జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Wanaparthy_Road_Accident_Today
Wanaparthy_Road_Accident_Today
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 4, 2024, 6:43 AM IST

Updated : Mar 4, 2024, 10:48 AM IST

Wanaparthy Road Accident Today : వనపర్తి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొత్తకోట సమీప జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి(Car Out of Control) చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడగా, వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.

వీరంతా హైదరాబాద్‌లోని బండ్లగూడలో పెళ్లి చూపులకు వెళ్లి తిరిగి బళ్లారికి వెళ్తుండగా ఈ ప్రమాదం (Road Accident in Wanaparthy) జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను(Injuries) సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో అబ్దుల్‌ రహమాన్‌ (62), సలీమా జీ (85), చిన్నారులు బుస్రా (2), మరియా (5), వాసిర్‌ రవుత్‌ (7 నెలలు) ఉన్నారు.

రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు - పది మంది మృతి

Kothakota Road Accident Today : ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో సమీరా (5), హుస్సేన్‌ (10), షఫీ, ఖదీరున్నీసా, హబీబ్, అలీ, షాజహాన్ బేగ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వారిలో అలీకి వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఒకే కుటుంబానికి చెందిన 12 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఓఆర్‌ఆర్‌పై హడలెత్తిస్తున్న ప్రమాదాలు - అతి వేగం, అజాగ్రత్తే కారణం!

సోమవారం వేకువజామున రెండున్నర నుంచి మూడు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. డైవర్ నిద్రమత్తులో కారు నడపడం వల్లే ఘటన జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనా(Police Estimate) వేస్తున్నారు. కారు చెట్టుకు బలంగా ఢీ కొట్టడంతో ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయిందని చెప్పారు. అందులో చిక్కుకున్న చిన్నారుల మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు, ఎల్ అండ్ టీ సిబ్బంది గంటకుపైగా శ్రమించాల్సి వచ్చింది.

Car Accident in Wanaparthy : ప్రమాద తీవ్రతను బట్టి ప్రమాదం జరిగిన సమయంలో కారు అతివేగంగా ప్రయాణిస్తునట్లు తెలుస్తోంది. హైదరాబాద్ -బెంగళూరు జాతీయ రహదారిపై(National High Way) నిద్రమత్తులో వాహనాలు నడపడం వల్ల ఇటీవల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వేగంగా దూసుకొచ్చిన కారు- క్షణాల్లో తల్లీకూతురు దుర్మరణం

Last Updated : Mar 4, 2024, 10:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.