ETV Bharat / state

తొలిసారి అసెంబ్లీలోకి..- మాతృమూర్తి ఆశీస్సులు తీసుకున్న గుడివాడ ఎమ్మెల్యే రాము - Ramu Come to First Time in Assembly

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 21, 2024, 10:13 AM IST

Venigandla Ramu Will Come to First Time For Assembly: సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఘన విజయం సాధించిన వెనిగండ్ల రాము తొలిసారి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనున్నారు. మాతృమూర్తి శాంతమ్మ ఆశీస్సులు తీసుకొని అసెంబ్లీ వెళ్లారు. ప్రొటెం స్పీకర్​ బుచ్చయ్య చౌదరి శాసనసభలో రాముతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

Venigandla Ramu Will Come to First Time For Assembly
Venigandla Ramu Will Come to First Time For Assembly (ETV Bharat)

Venigandla Ramu Will Come to First Time For Assembly: కృష్ణా జిల్లా గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వెనిగండ్ల రాము తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఘన విజయం సాధించిన వెనిగండ్ల రాము తొలిసారి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు తన స్వగృహం నుంచి బయలుదేరి వెళ్లారు. నేడు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేగా వెనిగండ్ల రాము ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్​ బుచ్చయ్య చౌదరి శాసనసభలో రాముతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన గోరంట్ల- అసెంబ్లీలో ఫస్ట్ ప్రమాణం చేసేదెవరో తెలుసా? - andhra pradesh assembly session

అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యే ఇంటి నుంచి బయలుదేరే ముందు తన స్వగృహంలో ఉన్న మాతృమూర్తి శాంతమ్మ ఆశీస్సులను తీసుకొని అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యే రాము బయలుదేరారు. మార్గమధ్యలో గుడివాడ మెయిన్ రోడ్డులోని శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. అనంతరం ఆయన విఘ్నేశ్వర స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఎమ్మెల్యే రాముకు వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేయగా దేవస్థాన ఈవో ప్రసాద్ ఆలయ సంప్రదాయ ప్రకారం రాముకి గౌరవ సత్కారం చేశారు.

సీఎంగానే శాసనసభకు - రెండున్నరేళ్ల తర్వాత అడుగుపెడుతున్న చంద్రబాబు - CM chandrababu to Assembly

చంద్రన్న ప్రభుత్వం కొలువు తీరడంతో ఐదు సంవత్సరాలుగా ఆగిపోయిన అభివృద్ధి తిరిగి పరుగులు పెడుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము అన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్డీయే ప్రభుత్వ పాలన సాగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో గుడివాడ వైఎస్సార్సీపీ అభ్యర్థి కొడాలి నానిపై వెనిగండ్ల రాము ఎమ్మెల్యేగా గెలిచారు.

మరోవైపు నేడు అసెంబ్లీ సమావేశాలకు కూటమి నేతలు శాసనసభకు చేరుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆరుగురు తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. వీరిలో పామర్రు నుంచి వర్ల కుమార్‌రాజా, గుడివాడ నుంచి వెనిగండ్ల రాము, విజయవాడ పశ్చిమ నుంచి సుజనా చౌదరి, తిరువూరు నుంచి కొలికపూడి శ్రీనివాసరావు, గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు, పెడన నుంచి కాగిత కృష్ణప్రసాద్‌ ఉన్నారు. వీరితో ప్రొటెం స్పీకర్​గా ఉన్న​ బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

నేడే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం - కొలువుదీరనున్న 16వ శాసనసభ - AP ASSEMBLY SESSION

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.