People Suffering With Snow in Prakasam DIstrict: అసలే చలికాలం. ఇంకా ఈ సమయంలో మంచు కురిస్తే ఇళ్ల నుంచి ఎవరైనా బయటకు వస్తారా అంటే కష్టమే. కానీ అత్యవసర పనులు ఉన్నవాళ్లు బయటకు రాక తప్పని పరిస్థితి. ఇలా బయటకు వచ్చినవాళ్లు కశ్మిర్లో కురిసే మంచులాంటి వాతావరణానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఘటనే ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
వేకువ జాము నుంచే పొగ మంచు కమ్మేయటంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. దట్టమైన పొగమంచు కారణంగా రహదారులన్నీ మూసుకుపోయాయి. ఎదురుగా ఉన్న వాహనాలు కూడా కనిపించకపోవడంతో వాహనాలు నెమ్మదిగా నడుపుతున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు, మార్టూరు, టంగుటూరు తదితర గ్రామీణ ప్రాంతాలతో పాటు జాతీయ రహదారిపై ఈ పరిస్థితి ఏర్పడింది. దారి కనిపించకపోవడంతో టంగుటూరు టోల్ ప్లాజా వద్ద అనేక వాహనాలను నిలిపివేశారు. ఉదయం 8 గంటల వరకు ఈ పరిస్థితులతో రవాణా ఇబ్బందికరంగా మారింది. రహదారులన్నీ మంచుతో కప్పేయడంతో వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు.
మంచు ఎక్కువగా కురవడం వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు తెలిపారు. ఉదయం 8 గంటలు అయినా సరే మంచు ప్రభావం ఉండటంతో స్థానికులు రోడ్డుపైకి రావడానికి విముఖత చూపారు. దట్టమైన పొగమంచుతో రోడ్లన్నీ ఖాళీగా దర్శనం ఇచ్చాయి. శీతాకాలం వచ్చిందంటే చలితో పాటు పొగమంచు దర్శనమిస్తోంది.
మంచు కురిసే వేళలో లంబసింగి టూర్ - అవి చూడాలి, ఇవి తినాలి
పడిపోతున్న ఉష్ణోగ్రతలు - ఏజెన్సీలో అందాలను ఆస్వాదిస్తున్న పర్యటకులు