ETV Bharat / state

వృద్ధ మహిళ దారుణ హత్య - రాత్రి వేళ గొంతుకోసి పరారైన దుండగులు - unknown persons killed old woman - UNKNOWN PERSONS KILLED OLD WOMAN

Unknown Persons Killed Old Woman in Bapatla District : బాపట్ల జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళను రాత్రి వేళ దుండగులు గొంతుకొని హతమార్చారు. రక్తపుమడుగుల్లో నిర్జీవంగా పడిఉన్న మహిళను చూసి స్థానికులు తీవ్ర భయందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్వాడ్​తో దర్యాప్తు చేపట్టారు.

Unknown Persons Killed Old Woman in Bapatla District
Unknown Persons Killed Old Woman in Bapatla District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 24, 2024, 9:37 PM IST

Unknown Persons Killed Old Woman in Bapatla District : బాపట్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని ఈపూరుపాలెంలో ఓ వృద్ధ మహిళను దుండగులు గొంతుకొని హతమార్చారు. మృతురాలు ఈపూరుపాలెం పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆమె భర్త మృతి అనంతరం పిల్లలు ఇతర ప్రాంతాల్లో ఉండటంతో ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఇదే అదునుగా భావించిన దుండగులు రాత్రి వేళ ఇంట్లోకి చోరబడి హత్య చేశారు. హత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పిల్లనిచ్చిన మామను హతమార్చిన అల్లుడు - కారణం తెలిస్తే షాక్​ అవుతారు - Son In Law Killed Uncle

వృద్ధ మహిళను గొంతుకోసి హతమార్చిన దుండగులు : వివరాల్లోకి వెళ్తే, బాపట్ల జిల్లాలోని చీరాల మండలం ఈపూరుపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిల్లి లలిత(74) అనే వృద్ధ మహిళ తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేసి పదవీ విరమణ పొందారు. లలిత భర్త ఎనిమిదేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందారు. అలాగే ఉన్న ముగ్గురు పిల్లలు సైతం అమెరికా, విజయవాడలో నివాసం ఉంటున్నారు. దీంతో ఇంట్లో పిల్లి లలిత ఒక్కరే నివసిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన దుండగులు ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్దురాలు లలితను నిన్న(మంగళవారం) రాత్రి వేళ గొంతుకోసి హతమార్చారు.

క్లూస్ టీమ్, డాగ్ స్వాడ్​తో దర్యాప్తు : అయితే పెద్దకుమారుడు అమెరికా నుంచి తల్లి లలితకు ఫోన్ చేశారు. ఎన్ని సార్లు చేసిన స్పందించ లేదు. దీంతో కంగారు పడ్డ కుమారుడు అదే విధిలో ఉన్న తన స్నేహితుడు శ్రీనివాస్​కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. దీంతో లలిత ఇంటికి వెళ్లి తలుపులు తెరచి చూడగా అప్పటికే ఆమె రక్తపుమడుగుల్లో నిర్జీవంగా పడి ఉంది. ఒక్కసారిగా భయందోళనకు గురైన శ్రీనివాస్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రాత్రి సమయంలోనే ఘటన స్థాలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా ఎస్పీ తుషార్ డూడీ సైతం ఘటన ప్రాంతాన్ని చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. తరువాత కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్వాడ్​తో దర్యాప్తు చేపట్టారు. హత్య జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఆ దారుణ హత్యకు కారణాలు ఏంటి? - వెలుగులోకి విస్తుపోయే విషయాలు - Reasons for Vinukonda Murder

అనుమానాస్పదంగా ఆటో డ్రైవర్​ మృతి - ఆస్తి తగాదాలే కారణమా? - Auto Driver Murder in Satya sai

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.