ETV Bharat / state

విజయవాడ చేరుకున్న అమిత్ షా, జేపీ నడ్డా - చంద్రబాబుతో భేటీ - Amisha met with Chandrababu

Union Minister Amisha met Chandrababu: చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరయ్యేందుకు వచ్చిన బీజేపీ అగ్రనేతలకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ఉండవల్లికి చేరుకున్న వారికి చంద్రబాబు స్వాగతం పలికారు. మంత్రివర్గ కూర్పు, బీజేపీ నుంచి ఎవరికి పదవులు కేటాయించాలి అనే దానిపై చర్చించేందుకు కేంద్రమంత్రి అమిత్‌షా, జేపీ నడ్డాలు చంద్రబాబుతో భేటీ అయ్యారు.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 11, 2024, 10:38 PM IST

Updated : Jun 11, 2024, 10:57 PM IST

Union Minister Amisha met Chandrababu
Union Minister Amisha met Chandrababu (ETV Bharat)

Union Minister Amisha JP Nadda met with Chandrababu: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయడు ప్రమాణ సీకారం నేపథ్యంలో కేంద్ర మంత్రులు, వీవీఐపీలు విజయవాడకు తరలి వస్తున్నారు. గన్నవరం ఏయిర్ పోర్టుకు చేరుకు చేరుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మెగా స్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ తదితరులకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, టీడీపీ నేతలు స్వాగతం పలుకుతున్నారు.

తాజాగా రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోం మత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు (BJP National President JP Nadda) నారా లోకేశ్ గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నేతలు ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులు అమిత్ షా, నడ్డాకు స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రివర్గ కూర్పుపై, కూటమి నేతలు చంద్రబాబుతో చర్చిస్తున్నారు. చర్చల అనంతరం అమిత్ షా, నడ్డాలు నోవాటెల్ హోటల్‌లో బస చేయనున్నారు.

డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ - మంత్రి యోగం ఎవరెవరికో? - AP NEW CABINET MINISTERS list

బీజేపీ మంత్రుల విషయంలో స్పష్టత వచ్చాక, మిగతా మంత్రివర్గంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అనంతరం చంద్రబాబు గవర్నర్‌కు మంత్రుల జాబితాను పంపనున్నారు. మంత్రులుగా అవకాశం దక్కిన బీజేపీ నేతలకు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ఆశావహులు విజయవాడ, గుంటూరులో మకాం వేసి మంత్రి పదవి కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. చంద్రబాబు నుంచి వచ్చే ఫోన్ కోసం నేతలు నిరీక్షిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర ముఖ్య అతిథిగా ఆహ్వానాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) విజయవాడ చేరుకున్నారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన కుటుంబసభ్యులతో కలిసి బయల్దేరారు. చిరంజీవి వెంట ఆయన సతీమణి సురేఖ, కుమార్తె శ్రీజతోపాటు ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు. బుధవారం ఉదయం జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో కుటుంబంతో కలిసి చిరంజీవి పాల్గొననున్నారు.

చంద్రబాబు ప్రమాణస్వీకారానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వ బాధితులకు ఆహ్వానం

Last Updated : Jun 11, 2024, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.