Two Wheelers Theft Gang Arrest in Eluru District : చెడు వ్యసనాలకు బానిసైన ఐదుగురు యువకులు ఓ ముఠాగా ఏర్పడ్డారు. సులువుగా డబ్బు సంపాదించే లక్ష్యంతో ద్వి చక్ర వాహనాలు (two Wheelers) దొంగతనాలకు పాల్పడుతున్నారు. వాటిని విక్రయించి వచ్చిన సొమ్ముతో జల్సాలకు అలవాటు పడ్డారు. ఎట్టకేలకు పోలీసులు చిక్కి ఊచలు లెక్కపెడుతున్నారు. ఈ సంఘటన ఏలూరు జిల్లా (Eluru District ) చేబ్రోలులో జరిగింది.
పోలీసు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు గాలం - కోట్లలో వసూళ్లు
Five Members Gang were Caught During the Police Check : ఉంగుటూరు మండలం కైకరానికి చెందిన దొడ్డి లక్ష్మీనారాయణ, చిటికిన పవన్ కుమార్ చెడు వ్యసనాలకు బానిసై ద్వి చక్ర వాహనాలు దొంగిలించి గతంలో పోలీసులకు పట్టుబడ్డారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ప్రవర్తన మార్చుకోలేదు. వీరికి నారాయణపురానికి చెందిన పంతగాని లోకేశ్, పిండ్రాల నాగులు, భీమడోలు మండలం పూళ్లకి చెందిన చిట్టాబత్తుల కార్తీక్ పరిచయం అయ్యారు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి ఎక్కువ వేగంగా నడిచే ద్వి చక్ర వాహనాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తున్నారు. దొంగిలించిన ద్వి చక్ర వాహనాలను విక్రయించి జల్సాలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు.
కంటైనర్‌లో తరలిస్తున్న 450 కిలోల గంజాయి పట్టివేత - నిందితులు అరెస్ట్
Police Investigation Revealed that Crimes were Committed for Money : ఈ క్రమంలోనే చేబ్రోలు పోలీసు స్టేషన్లో తన ద్వి చక్ర వాహనం చోరీకి గురైందని ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన నిడమర్రు, చేబ్రోలు పోలీసులు కైకరం జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో నంబర్లు లేని రెండు బైక్‌లపై వస్తున్న ఐదుగురు పోలీసులను చూసి పారిపోవడానికి యత్నించగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. తమదైన శైలిలో విచారణ చేసి రూ. 30 లక్షలు విలువ చేసే 25 ద్విచక్ర వాహనాలను రికవరీ చేశారు. దొంగల ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సీఐ, చేబ్రోలు, నిడమర్రు, గుణపవరం పోలీసులను డీఎస్పీ అభినందించి నగదు ప్రొత్సాహకాలు అందజేశారు.
సినీఫక్కీలో గ్యాంగ్ వార్ - అందరూ చూస్తుండగానే కత్తులతో యువకుడి హత్య