ETV Bharat / state

అన్నప్రసాద కేంద్రం ఆధునికీకరణ- తిరుమలను సెట్‌రైట్‌ చేసే దిశగా చర్యలు వేగవంతం - Modernization of Annaprasada Centre

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 11, 2024, 4:30 PM IST

TTD EO Shyamala Rao Action on Annadanam : తిరుమల కొండపై కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్నే కాదు దర్శనం తర్వాత శ్రీవారి అన్నప్రసాదాన్నీ భక్తులు అంతే పవిత్రంగా స్వీకరిస్తారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో రోజూ 2 లక్షల మంది భోజనం చేస్తారు. కానీ జగన్ జమానాలో అన్నప్రసాద వితరణపై ఎన్నడూలేనన్ని విమర్శలు వెల్లువెత్తాయి.

ttd_eo_shyamala_rao_action_on_annadanam
ttd_eo_shyamala_rao_action_on_annadanam (ETV Bharat)

TTD EO Focus on Providing Delicious And Clean Food to Devotees in Tirumala : తిరుమల శ్రీవారి అన్నప్రసాదాన్ని భక్తులకు మరింత రుచిగా, శుచిగా అందించేందుకు టీటీడీ రంగంలోకి దిగింది. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని ఆధునీకరించాలని నిర్ణయించింది. గత ఐదేళ్లలో భక్తుల నుంచి వచ్చిన విమర్శలు పునరావృతం కాకుండా పూర్తిస్థాయి ప్రక్షాళనకు టీటీడీ ప్రస్తుత ఈవో (EO) శ్యామలరావు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.

తిరుమల కొండపై కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్నే కాదు దర్శనం తర్వాత శ్రీవారి అన్నప్రసాదాన్నీ భక్తులు అంతే పవిత్రంగా స్వీకరిస్తారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో రోజూ 2 లక్షల మంది భోజనం చేస్తారు. కానీ జగన్ జమానాలో అన్నప్రసాద వితరణపై ఎన్నడూలేనన్ని విమర్శలు వెల్లవెత్తాయి! అన్నం ఉడికీ ఉడకకుండా, సాంబారు, ఇతర ఆహార పదార్థాలు రుచికరంగా లేకుండా వడ్డించారనే పాపాల్ని నాటి పాలకులు మూటగట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలను సెట్‌రైట్‌ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ EOగా శ్యామలరావును పంపారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కొండపై ఒక్కో వ్యవస్థను ఆకళింపు చేసుకుని గాడిలో పెడుతున్న శ్యామలరావు అన్నదానం నాణ్యతపై దృష్టి సారించారు. తరిగొండ వెంగమాంబ అన్నదాన కేంద్రాన్ని తనిఖీ చేశారు. భక్తులతో మాట్లాడారు. అక్కడి సిబ్బందికి తగిన సూచనలిచ్చి అన్నప్రసాద నాణ్యతను పునరుద్ధరించారు.

Vigilance Inquiry: ధర్మారెడ్డి, విజయ్​కుమార్​రెడ్డిపై విజిలెన్స్​ విచారణకు ఆదేశం - Inquiry ON TTD EO IPR COMMISSIONER`

దీర్ఘకాలంలోనూ అన్నప్రసాద నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా ఉండేందుకు శ్యామలరావు నడుంకట్టారు. దక్షిణ భారతదేశంలోని ప్రఖ్యాత చెఫ్‌లను పిలిపించి వారి సలహాలు స్వీకరించారు. వారి సలహాల మేరకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలోని వంటశాలలు ఆధునీకరించాలని నిర్ణయించారు. అధునాతన శాస్త్ర, సాంకేతిక పద్ధతిలో కూరగాయలు, వంట సరుకులు నిల్వ చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. ఒకట్రెండు నెలల్లో అన్నప్రసాద కేంద్ర ఆధునికీకరణకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయాలని శ్యామలరావు పట్టుదలగా ఉన్నారు.

'ఇక వంటశాలలోని సిబ్బందికి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేలా శిక్షణ ఇప్పించాలని భావిస్తున్నాం. ఆహార పదార్థాల పరిశుభ్రత, వ్యర్థ పదార్థాల నిర్వహణ, తదితర అవససరాలకు ఇన్‌హౌస్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తనిఖీలు చేసేలా చూస్తాం. భక్తుల సంఖ్యకు అనుగుణంగా అన్నప్రసాద కేంద్రంలో సిబ్బందినీ పెంచుతాము.' -శ్యామలరావు, టీటీడీ ఈవో

తిరుమలలో పాతపద్ధతులన్నీ పునరుద్ధరణ - ఐదేళ్లు వైఎస్సార్సీపీ అసమర్థ విధానాలతో భక్తులకు ఇక్కట్లు - TTD FACILITIES IMPROVE IN TIRUMALA

మరింత నాణ్యంగా శ్రీవారి లడ్డూ- పోటు కార్మికులతో ఈవో సమావేశం - TTD EO met with the potu workers

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.