Tribute to Paritala Ravi: దివంగత నేత పరిటాల రవీంద్ర ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిన ఓ శక్తి అని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. శ్వాస ఉన్నంత వరకు రవి ఆశయాలు నెరవేర్చేడమే ధ్యేయంగా పని చేస్తామని రవి కుటుంబీకులు వెల్లడించారు. పరిటాల రవి 19వ జయంతి సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లా వెంకటాపురంలో రవీంద్ర ఘాట్ వద్ద రవి భార్య పరిటాల సునీత, కుమారుడు పరిటాల శ్రీరామ్‌తో పాటు కుటుంబసభ్యులు ఆయనకు అంజలి ఘటించారు. రవి సమాధికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాల నుంచే కాకుండా కర్ణాటకలోని పలు ప్రాంతాల నుంచి కూడా పరిటాల అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి పరిటాల రవికి నివాళులు అర్పించారు.
కదిరిలో పరిటాల రవికి ఘనంగా నివాళులు
రవీంద్ర ఆశయాలను ముందుకు తీసుకెళ్లటానికి సునీత, తన కుమారుడు ధర్మవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆమె వెల్లడించారు. పరిటాల రవి పేదల కోసం చేసిన కృషి గురించి తెలియని వారు పిచ్చికూతలు కూస్తున్నారని సునీత మండిపడ్డారు. పరిటాల రవీంద్ర ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తునట్టు శ్రీరామ్ తెలిపారు. వ్యక్తి ఎన్నిరోజులు బతికాడనేది కాకుండా, ఎలా బతికాడు అన్నది చాలా ముఖ్యమని, అందువల్లనే పరిటాల రవి బలహీన వర్గాల వారు మరిచిపోలేని వ్యక్తిగా నిలిచిపోయారన్నారు. రాష్ట్రంలో పలు చోట్ల ఈరోజు పరిటాల రవీంద్ర పేరుతో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్న అందిరికీ అభినందలు తెలిపారు. రక్తదానంతో ప్రాణదాతలు కావాలని పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు.
CBN Tribute To Paritala Ravindhra: ప్రజలను కోసం జీవితమంతా పోరాడి తన చివరి క్షణాలను కూడా ప్రజల మధ్యే గడిపిన అమరుడు టీడీపీ నేత పరిటాల రవీంద్ర అని సామాజిక మాధ్యమం ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ నివాళులు అర్పించారు.
అన్యాయాన్ని ఎదుర్కోవాలనే వారికి పరిటాల రవి స్ఫూర్తి: చంద్రబాబు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్లో పరిటాల రవి వర్ధంతి వేడుకలను నిర్వహించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో పలువురు టీడీపీ కార్యకర్తలు పరిటాల రవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, పరిటాల రవి వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ పరిటాల రవి తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలు ఎనలేనివని అలాంటి నాయకులు పార్టీకి ఎంతో అవసరం అని కొనియాడారు.
మహిళలకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో న్యాయం జరిగిందని సునీత స్పష్టం చేశారు. సత్యసాయి జిల్లా వెంకటాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పరిటాల సునీత మాట్లాడుతూ మంగళవారం ఉరవకొండ సభలో చంద్రబాబు నాయుడుపై సీఎం జగన్ చేసిన ఆరోపణలపై మండిపడ్డారు. బటన్లు నొక్కి జగన్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజక్టును నిర్మించలేని దద్దమ్మ జగన్ అంటూ విమర్శించారు.