ETV Bharat / state

లోటుపాట్లు లేకుండా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం - అమలు తేదీపై త్వరలో చంద్రబాబు నిర్ణయం: రామ్‌ప్రసాద్‌రెడ్డి - Free Bus For Ladies in AP - FREE BUS FOR LADIES IN AP

Transport Minister on Free Bus For Ladies in AP : మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీ అమలుకు ప్రభుత్వ కసరత్తు తుది దశకు చేరుకుంది. ఆర్టీసీ, రవాణా శాఖలపై ఈ నెల 12న సీఎం నారా చంద్రబాబు నాయుడు నిర్వహించే సమీక్షలో ఈ పథకం అమలు తేదీని ప్రకటించే అవకాశముందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి చెప్పారు. అలాగే రవాణా శాఖలో కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని, ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Transport Minister Ram Prasad Reddy on Free Bus For Ladies in AP
Transport Minister Ram Prasad Reddy on Free Bus For Ladies in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 9, 2024, 12:25 PM IST

Updated : Aug 10, 2024, 6:58 AM IST

Transport Minister Ram Prasad Reddy on Free Bus For Ladies in AP : మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీ అమలుకు ప్రభుత్వ కసరత్తు తుది దశకు చేరుకుంది. ఆర్టీసీ, రవాణా శాఖలపై ఈ నెల 12న సీఎం నారా చంద్రబాబు నాయుడు నిర్వహించే సమీక్షలో ఈ పథకం అమలు తేదీని ప్రకటించే అవకాశముందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి చెప్పారు. ఎక్కడా లోటుపాట్లకు తావు లేకుండా పథకాన్ని పటిష్ఠంగా అమలు చేస్తామని తెలిపారు. రవాణా శాఖ ఉన్నతాధికారులతో రవాణా శాఖ మంత్రి మండిపల్లి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొందరు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రవాణా శాఖలో కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని, ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.

ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచేలా చర్యలు : గత ఐదేళ్లలో చౌకబియ్యం కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలివెళ్లాయన్న మంత్రి, అక్రమంగా వెళ్తున్న వాహనాలను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. అక్రమంగా తరలిస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేయకపోవడంపై రామ్‌ప్రసాద్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా ఇసుక, మైన్స్ తరలింపు వాహనాలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రవాణా శాఖలో అవినీతి, నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అక్రమార్కుల పని పట్టి ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రవాణా శాఖలో ప్రక్షాళనకు ఆదేశాలు జారీ చేశారు.

ఛార్జీలు పెంచకుండానే బస్సు సర్వీసులు పెంచుతాం: మంత్రి రాంప్రసాద్ రెడ్డి - Minister Ramprasad Reddy on RTC

వారికి ఉద్యోగాలివ్వండి : వైఎస్సార్సీపీ పాలనలో ఆర్టీసీలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై మంత్రి ఉన్నతాధికారులను ఆరా తీశారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించని బకాయిలు, సమస్యల పరిష్కారంపై చర్చించారు. అమరావతి బ్రాండ్ ఏసీ బస్సులను పూర్వవైభవం తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ ఉద్యోగులకు వస్తోన్న ఆరోగ్య సమస్యలు, కల్పిస్తోన్న సదుపాయాలను ఆరా తీశారు. ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్లు, సిబ్బంది కొరతను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఆర్టీసీ బస్సుల్లో, బస్టాండ్లలో పరిశుభ్రతను పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగాలివ్వాలని స్పష్టం చేశారు. కారుణ్య నియామకాల్లో జాప్యాన్ని నివారించి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కార్బన ఉద్గారాలను నివారించేందుకు ఎలక్ట్రికల్ వాహనాలను త్వరితగతిన అందుబాటులో తేవడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఆర్టీసీకి మంచిరోజులు- 1400 బస్సుల కొనుగోలుకు సీఎం గ్రీన్​ సిగ్నల్​ : మంత్రి రాంప్రసాద్​రెడ్డి - new busses for apsrtc

గత ఐదేళ్లలో ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైంది : ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రజల్లో ఏపీఎస్‌ఆర్టీసీ ఒక భాగమైందని, ప్ర తిఒక్కరికీ చేరువైందని రామ్‌ప్రసాద్‌రెడ్డి తెలిపారు. మెరుగైన సేవలందించాలంటే ఆర్థిక పరమైన అంశాలుంటాయని, అన్ని అంశాలు సీఎంతో చర్చించే సంస్థను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు.

కార్మికులకు ఎప్పటి నుంచే ఉన్న సమస్యలపైనా చర్చిస్తామని, అక్రమంగా రవాణా జరుగుతున్న వాటిపై నిఘా పెడతామని వెల్లడించారు. గత ఐదు సంవత్సరాలు ఖనిజాలు, రేషన్‌ బియ్యం అక్రమంగా తరలించారని ఆరోపించారు. గత ప్రభుత్వం ఆర్‌సీ కార్డు కూడా ఇవ్వని పరిస్థితి నెలకొందని అన్నారు. గత ఐదేళ్లలో ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైందని, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. అమరావతి బ్రాండ్‌ దెబ్బతీయడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు.

సీఎం చంద్రబాబుతో సమీక్ష : మరో ఎన్నికల హామీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం కొనసాగుతోంది: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి - MINISTER MANDIPALLI ON FREE BUS

Last Updated : Aug 10, 2024, 6:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.