Tirupati DFO Satish Comments on Tirumala Alipiri Walkway Safety : తిరుమల అలిపిరి కాలిబాట గాలి గోపురం నుంచి లక్ష్మీ నరసింహ ఆలయం వరకు సమీప అడవిలోకి భక్తులెవరు వెళ్ళకూడదని, అలిపిరి కాలిబాట అడవిలోకి భక్తుల అనుమతి నిషేధించినట్లు తిరుపతి అటవీ శాఖ అధికారి డీఎఫ్‌వో సతీష్ తెలిపారు. గాలి గోపురం, లక్ష్మి నరసింహ ఆలయం ప్రాంతంలో మెట్ల మార్గం నుంచి 200 మీటర్ల అడవి ప్రాంతంలో క్రూర మృగాల జాడ ఎక్కువగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అలిపిరి నడక మార్గంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక కమిటీ, జాతీయ జంతు సంరక్షణ అధికారులు మూడు సార్లు పరిశీలించారని గుర్తు చేశారు.
నడక మార్గం అడవిలో చిరుతలు, ఎలుగు బంటిలు ఇరువైపులా అడవి ప్రాంతంలోకి దాటడం కోసం జంతు సంరక్షణ అధికారులు పలు ప్రాంతాలను గుర్తించార అన్నారు. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ప్రణాళిక సిద్ధం చేస్తామని, జంతువులు ఇరువైపులా దాటడం కోసం నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఏడాదిలో ఒక సీజన్ శేష చలం అడవుల్లో ఏనుగుల గుంపు సంచరించడం జరుగుతుందని, శేషాచలం అడవుల్లో ఏనుగుల గుంపు కోసం నీటి గుండాలను ఏర్పాటు చేసి తిరుమలకు రాకుండా చేస్తామని అన్నారు.
తిరుమల నడకమార్గంలో చిరుత కలకలం - అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు - Cheetah movements in tirumala
Cheetah at Alipiri Walkway in Tirumala : ఈ నెల 25, 26 తేదీల్లో తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుత కదలికలపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు పలు చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుత సంచారంపై నిఘా పెట్టారు. అలిపిరి కాలిబాట అడవి ప్రాంతంలో ఓ పంది వెళ్తుండగా చెట్టుపై నుంచి దాన్ని వేటాడేందుకు చిరుత తదేకంగా చూస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో పాటు ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చిరుత సంచారంతో అప్రమత్తమైన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులను అలర్ట్ చేశారు. భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు.
Six Leopards Caught in Tirumala : గత సంవత్సరం ఆగస్టు 11న నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత అనే ఆరేళ్ల చిన్నారిని చిరుత హతమార్చిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీంతో తిరుమలలో చిరుతలను బంధించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఆపరేషన్ చిరుత పేరుతో ఇప్పటి వరకూ ఆరు చిరుతలను పట్టుకున్నారు. వీటిని జూ కు తరలించడం, అడవుల్లో వదలడం జరిగింది.
చిన్నారి లక్షితను చంపిన చిరుతను గుర్తించిన అధికారులు
Leopard Attacked on Boy in Tirupati : గత సంవత్సరం జూన్ 22 తిరుమల నడకదారిలో ఇలాంటి ఘటనే జరిగింది. ఈ ఘటనలో కౌశిక్ అనే బాలుడు గాయపడ్డాడు. కర్నూలు జిల్లా ఆదోని హనుమాన్ నగర్‌కు చెందిన శిరీష, కొండయ్యల కుమారుడు ఐదేళ్ల కౌశిక్‌పై ఏడో మైలురాయి వద్ద చిరుత దాడి చేసింది. కౌశిక్ మెడ కరుచుకుని అమాంతం అడవిలోకి లాక్కెళ్లింది. చుట్టూ ఉన్న వాళ్లు కేకలేయడంతో వెంటనే వదిలేసి పరారైంది. చిరుత దాడిలో బాలుడు కౌశిక్ తీవ్రంగా గాయపడి తిరుపతిలోని చిన్న పిల్లల ఆస్పత్రిలో చికిత్స తర్వాత కోలుకున్నాడు.
హోటల్ గదిలో చిరుత బీభత్సం- 2గంటలు అక్కడే మకాం- చివరకు ఏమైందంటే?