Three Youths from Vizianagaram Drowned in Jami Check Dam : విజయనగరం జిల్లా జామి మండలం జాగరం వద్ద చెక్‌డ్యామ్‌లో ఈతకు దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ఇవాళ ఉదయం విజయనగరానికి చెందిన ఆరుగురు యువకులు గోస్తని నదిలో ఈత కొట్టడానికి వచ్చారు. వీరిలో ఒకరు ఈత కొట్టడానికి మొదట దిగారు. ప్రమాదవశాత్తూ అతడు నీటిలో మునిగిపోయారు. చెక్‌డ్యామ్‌లో మునిగిన యువకుడిని కాపాడేందుకు ఒకరి తర్వాత ఒకరు వెళ్లినట్లు తోటి స్నేహితులు సమాచారం ఇచ్చారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, రెస్కూ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. చెక్‌డ్యామ్ దిగువన జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గల్లంతైన అశోక్(19), షాకిత్(16), రజిక్(14) అనే ముగ్గురు యువకులు విజయనగరం కంటోన్మెంట్ వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరి మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. సుమారు 6 గంటలు పాటు పోలీసులు, రెస్కూ సిబ్బంది శ్రమించి మృతదేహాలను గుర్తించారు.
జామి మండలం జాగరం రిజర్వాయర్ వద్దకు ఆరుగురు యువకులు ఈత కొట్టడానికి వచ్చారు. ప్రమాదవశాత్తు ఓ యువకుడు మునిగిపోతుండగా మరో ఇద్దరు అతన్ని కాపాడానికి ప్రయత్నించి మునిగిపోయారు. ఎస్డీఆర్ఎఫ్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సహాయంతో గాలింపు చేపట్టి ముగ్గురు మృతదేహాలను వెలికి తీశాం. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని మిగిలిన ముగ్గురు యువకులు తెలిపారు. - ఉపేంద్ర ,శృంగవరపుకోట సీఐ